హైదరాబాద్: మనుషుల్లో వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్ ‘డీ-మాక్యులా’ పేరు తో సహజ సిద్ధంగా బయో యాక్టివ్ ఫైటోనూట్రి యెంట్ డైటరి సప్లిమెంట్‌ను తయారు చేసింది. ఇది సాఫ్ట్‌జెల్ క్యాప్సూల్ రూపంలో ఉంటుందని, కంటికి వచ్చే అంటువ్యాధులను సైతం నయం చేస్తుందని ఆ కంపెనీ తెలిపింది. అశ్వగంధ, బోస్విల్లా శరాషియో, జీగ్జాంథిన్, త్రిఫల, బిటా కెరోటిన్, కుంకుమ పువ్వును దేశీయ ఆవు నెయ్యిలో మరిగించి సేకరించిన రసాయనం ఆధారంగా డీ-మాక్యులా తయారు చేశామని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ ఆళ్ల లీలా రాణి తెలిపారు. కంటి మంట, చికాకు, పొడిబారడం, హానికర నీలి కాంతికి వ్యతిరేకంగా పోరాడడానికి, డయాబెటిక్ రెటినోపతి చికిత్సలో సహాయకారిగా ఉపశమనం పొందడానికి సాయపడుతుందన్నారు. ఇది ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో లభ్యమవుతుందన్నారు.