వీధి కుక్కల దాడిలో లేగ దూడ మృత్యువాత

– సింగారంలో ఘటన
– వరుస దాడులకు పాల్పడుతున్న వీధి కుక్కలు నష్టపోతున్న రైతులు
నవతెలంగాణ-యాచారం
వీధి కుక్కల దాడిలో ఆవు దూడ మత్యువాత పడింది. ఈ ఘటన యాచారం మండల పరిధిలోని నజ్జిక్‌ సింగారంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని సింగారం గ్రామానికి చెందిన వన్నవాడ ప్రభాకర్‌ రెడ్డి అనే రైతు పశువుల కొట్టం దగ్గర రాత్రి సమయంలో వీధి కుక్కలు దాడి చేసి ఆవు దూడను చంపితిన్నాయి. గతంలో కూడా అదే గ్రామానికి చెందిన ఓ రైతు లేక దూడను వీధి కుక్కలు దాడి ఘటన మరువకు మళ్లీ ఈ ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల వరుస దాడితో గ్రామంలోని రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పాలకవర్గం, సంబంధిత అధికారులు వీధి కుక్కలపై చర్యలు తీసుకోవడం లేదని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పాడి పరంగా తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వీధి కుక్కల దాడి నుంచి లేగ దూడలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.