నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు

– ఎస్ఐ  రాజశేఖర్
– నాలుగు ద్విచక్ర వాహనాల సీజ్
 నవతెలంగాణ – కమ్మర్ పల్లి
నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. సోమవారం సాయంత్రం  మండల కేంద్రంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనికీ నిర్వహించారు. వాహనాల తనిఖీ సందర్భంగా  నంబర్ ప్లేట్ లేని నాలుగు ద్విచక్ర వాహనాల సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. వాహనదారులు తమ  వాహనాలకు నంబర్ ప్లేట్ ఉండేలా చూసుకోవాలన్నారు. అంతేకాకుండా  వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. లేని పక్షంలో వాహనాలను సీజీ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ  తెలిపారు.