నవతెలంగాణ-శామీర్‌పేట
నాలాలు అక్రమంగా కబ్జా చేస్తే ఎంతటివారైనా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని జెడ్పీ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి హెచ్చరించారు. బుధవా రం మండల పరిషత్తు సమావేశ మందిరంలో ఎంపీపీ దాసరి ఎల్లూభా యిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రయివేట్ భవనంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని మండల కార్యాలయం వద్ద ఏర్పాటు చేయాలని సభ్యులు ఏకగ్రీవం గా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మెన్ మాట్లా డుతూ..నాలాలు కాపాడే బాధ్యత ఇరిగేషన్ అధికారులదేన ని తెలిపారు. అధిóకారులు తప్పనిసరిగా సమావేశానికి హాజరు కావాలని సూచించారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్‌రెడ్డి, జెడ్పీటీసీ మహంకాళి అనితలాలి, వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీడీవో వాణి గరుదాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.