కౌశిక్ రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి

Legal action should be taken against Kaushik Reddy– మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామిడి రాంరెడ్డి 

నవతెలంగాణ – బొమ్మలరామారం
మహిళలను కించపర్చే విధంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాంగ్రెస్ నాయకులు రామిడి రాంరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇటు మహిళలను, అటు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. మహిళలంటే చాతకాని వాళ్లు అని కౌశిక్ రెడ్డి ఉద్దేశ్యంలా ఉందన్నారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడంతో పాటు చర్చకు వస్తా సవాల్ చేసి దాక్కుని బీఆర్ఎస్ పార్టీ గుండాలతో ఎమ్మెల్యే గాంధీపై దాడికి పూనుకున్న కౌశిక్ రెడ్డి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ పిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ కాదా అని అన్నారు.అందులో భాగంగానే బీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డి చేరలేదా అని ప్రశ్నించారు.