స్మిత సబర్వాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

స్మిత సబర్వాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి– ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగారెడ్డి
నవతెలంగాణ-షాద్‌నగర్‌
వికలాంగులను కించపరిచే విధంగా ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన ఐఏఎస్‌ స్మిత సబర్వాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి భుజంగారెడ్డి అన్నారు. మంగళవారం షాద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ శరత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భుజంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మిత సభర్వాల్‌ వికలాంగులను కించపరిచే విదంగా జులై 21 న ఎక్స్‌ లో అంధుడిని కారు డ్రైవరుగా నియమిస్తామా? వైకల్యం ఉన్న వైద్యుడితో శస్త్రచికిత్స చేయించుకుంటామా? అని పోస్ట్‌ సరైన విధానం కాదని అన్నారు. అంగవైకల్యం శరీరానికి ఉండవచ్చు కానీ మనసుకు కాదని, ఎంతో మంది అంగవైకల్యం ఉన్నవారు సైతం మంచి ఉద్యోగాల్లో ఉన్నారని తెలిపారు. వికలాంగులను కించపరిచే ఉద్దేశంతో బహిరంగంగా ఉద్దేశపూ ర్వకంగా అవమానించడం దారుణమన్నారు. వికలాంగులను అగౌరవప రిచెందుకు ప్రయత్నం చేసినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.