నిర్మాత అని అనుకుంటున్న త్రిపురనేని చిట్టిబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

– చాకలి కులస్తులపై ఆయన మాట్లాడినటువంటి పదజాలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో రజక సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ రజక సంఘాల స్టేట్ కోఆర్డినేటర్ వడ్డేబోయిన శ్రీధర్,జిల్లా రజక సంఘం సీనియర్ నాయకులు సిరికొండ శివ కుమార్ లు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఇటీవల కాలంలో ఒక ప్రైవేటు న్యూస్ ఛానల్ లో లైవ్ డిబేట్ లో సిని నిర్మాత అని అనుకుంటున్న ఓ పిచ్చి త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ ఆఫ్టర్ చాకలి ఆఫ్ట్రల్ ఒక చాకలోడు అని పదే పదే వాక్యాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర రజక జాతి ఆత్మ గౌరవన్ని దెబ్బతీసేలా మాట్లాడడం ఒక నిర్మాత సంస్కారం కాదని, ఆనాడు అందరూ సమానమేనని  దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను గుర్తు చేసుకోవాలని సూచించారు.  కులము పేరుతో మదమెక్కి మాట్లాడిన చిట్టిబాబు అనే వ్యక్తి రజక జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాల సోదరులంతా ఏకమై రాస్తారోకులు, నిరసన కార్యక్రమలతో మీ ఇంటిని ముట్టడించి కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ నువ్వు క్షమాపణ చెప్పపపోతే నీకు బుద్ధి చెప్పేంత వరకు వదిలేది లేదు అని అన్నారు.