అసాంఘిక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు

– హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి
నవతెలంగాణ –  జమ్మికుంట
సమాజంలో అసాంఘిక చర్యలకు ఎవరు పాల్పడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి అన్నారు. శనివారం జమ్మికుంట పట్టణ పోలీస్ సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. స్టేషన్ కు మొదటిసారిగా వచ్చిన ఏసీపీకి, పట్టణ సీఐ ,పోలీసులు స్వాగతం పలికారు. ప్రజా ప్రతినిధులు ,వివిధ రాజకీయ పార్టీల నాయకులు శాలువా తో  ఘనంగా సన్మానించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శాంతి భద్రతల్ని  పరిరక్షిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ లో భాగంగా ఎవరికి ఏ సమస్య ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ఓరగంటి రవి, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.