న్యాయ సహాయం పాన్ ఇండియా ప్రచారం..

నవతెలంగాణ- భువనగిరి
దేశవ్యాప్తంగా జైలలో జువేనైల్ ఖైదీలను గుర్తించి వారి కేసులలో కావలసిన న్యాయ సలహా సహాయం న్యాయ సహాయ న్యాయవాదుల ద్వారా అందించటానికి ఈ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షులు  దశరథ రామయ్య తెలిపారు. శనివారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ జిల్లా కార్యదర్శి అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కే దశరథ రామయ్య భువనగిరి సబ్ జైలులో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల సూచనల మేరకు రిస్టోరింగ్ యూత్ కార్యక్రమాలను నిర్వహించారు. జైళ్లలో బాలనేరస్థులను గుర్తించడం & న్యాయ సహాయం అందించడం కోసం పాన్-ఇండియా ప్రచారం- 2024 ” కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ దేశ వ్యాప్తముగా అన్ని జైల్లలో జువెనైల్ ఖైదీలను గుర్తించి, వారి కేసులలో కావాల్సిన న్యాయ సలహా ,సహాయం  న్యాయ సహాయ న్యాయవాదుల ద్వారా అందించటానికి ఈ క్యాంపైన్ కార్యక్రమం నిర్వహించబడుతుందని దీనిలో భాగంగా భువనగిరికి. సబ్ జైలులో ఈ కార్యక్రమము నిర్వహించబడిందని తెలిపారు. ఈ కాంపెయిన్ కార్యక్రమం ఈనెల 25 నుండి ఫిబ్రవరి 27 వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎస్. జైపాల్, పారా లీగల్ వాలంటీర్లు కొడారి వెంకటేశం, బి. రాంబాయి, జైలు సిబ్బంది అనిల్ పాల్గొన్నారు.