‘లీగల్లీ వీర్‌’ రిలీజ్‌కి రెడీ

'Legally Veer' is ready for releaseసిల్వర్‌ కాస్ట్‌ బ్యానర్‌ పై ఎం. వీరనారాయణ రెడ్డి సమర్పణలో వీర్‌ రెడ్డి, దయానంద్‌ రెడ్డి, ఢిల్లీ గణేశన్‌, గిరిధర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘లీగల్లీ వీర్‌’. శాంతమ్మ మలికిరెడ్డి నిర్మాత. రవి గోగుల దర్శకుడు. సోమవారం ఈ చిత్ర గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో వీర్‌రెడ్డి మాట్లాడుతూ, ‘నాకు సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఏమీ లేదు. కరోనా టైంలో పాడ్‌ కాస్ట్‌ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో నాకు సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. మంచి సినిమా చేద్దాం అనుకున్నాను. లీగల్‌ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్రను చేయడం సులభంగా అనిపించింది. ఇంతవరకు మన దగ్గర లీగల్‌ థ్రిల్లర్‌ సినిమాలు అంతగా రాలేదు. రియల్‌ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నాను. నటనకు కొత్త కావడంతో నాకు చాలా కష్టంగా అనిపించింది. చాలా టేక్స్‌ తీసుకున్నాను. డబ్బింగ్‌లో కూడా ప్రాబ్లెం వచ్చింది. కానీ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈనెల 27 విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. ‘వీర్‌ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అనిపిస్తుంది. గ్లింప్స్‌ చూశాకా నాకు మాటలు రావడం లేదు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అని డైరెక్టర్‌ రవి గోగుల అన్నారు.