20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన ప్రభావవంతమైన వ్యక్తి లెనిన్ అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పేర్కొన్నారు. ఆదివారం లెనిన్ శత వర్ధంతి పురస్కరించుకొని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి సుందరయ్య భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రపంచ యుద్ధాన్ని యూరప్ వ్యాప్త శ్రామిక వర్గ విప్లవంగా మార్చాలని లెనిన్ ప్రచారం చేశాడన్నారు. అతను రచించిన రచనలతో అందరూ ప్రభావితమై సామ్రాజ్యవాదం మెడలు వంచారని తెలిపారు శ్రామిక వర్గానికి అండగా ఉండి అనేక విప్లవాలకు మార్గదర్శకుడు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్, ముత్యాలు పాల్గొన్నారు.