ఒక విప్లవకర పార్టీకి ఉండవల్సిన మార్క్సిస్టు సిద్ధాంతం, ఆచరణను ముందుకు తీసుకుపోవటంలో లెనిన్ చేసిన కృషి చాలా ప్రాముఖ్యత కలిగివున్నది. రష్యా విప్లవకాలంలో లెనిన్ తన సిద్ధాంతాన్ని ఆచరణ లో పెట్టడానికి చాలా కష్టపడ్డారు. కేంద్రీకృత ప్రజాస్వామ్యం పునాదులపై కమ్యూనిస్టు పార్టీని నిర్మించటంలో లెనిన్‌ది ప్రత్యేక స్థా నం. లెనిన్ దృష్టిలో పార్టీ నిర్మాణం విప్లవ సిద్ధాంతంలో అంతర్భాగం. ‘ఏమి చేయాలి’ అనే చిన్న పుస్తకంలో ”విప్లవ సిద్ధాంతం లేకుండా విప్లవం ఉండదు” అని నొక్కి చెప్పారు. 1902లో ప్రచురితమైన ఈ పుస్త కంలో సరియైనపార్టీ మాత్రమే విప్లవ సిద్ధాంతాన్ని విప్లవోద్యమంగా మలచ గలదు అని విశదీకరించి చెప్పారు. లెనిన్ ప్రకారం ”అధికారం కోసం జరిగే పోరా టంలో కార్మికవర్గానికి పార్టీ తప్ప మరొక ఆయుధం లేదు. ”విప్లవపార్టీకి అనుగుణమైన పార్టీ నిర్మాణం రూ పొందించి, సుస్థిరపరచటానికి 1900-1906 మధ్య కాలంలో లెనిన్ రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ లో అంతర్గత పోరాటాన్ని చేశారు. ఆ కాలంలో, జర్మనీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ కార్మికవర్గ పార్టీగా అభివృద్ధి అయి, యూరోపులోని కార్మికవర్గ పార్టీలకు ఒక నమూనాగా వుండింది. తరువాతి కాలంలో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీ బోల్షివిక్, మెన్షివిక్ పార్టీ లుగా చీలిపోయింది. ఈ చీలికకు దారితీసిన ముఖ్య కారణాలలో ఒకటి పార్టీ వ్యవస్థ ఎలా వుండాలి, సభ్యత్వానికి సంబంధించినది.
వర్గచైతన్యం
చివరికి, లెనిన్ ఆలోచనా దృక్పధం బోల్షివిక్ పార్టీ నిర్మాణంలో కనపడుతుంది. రష్యా కార్మికవర్గ ఉద్యమం లోని ఆర్ధికవాదులపై లెనిన్ తన మొదటి పోరాటాన్ని ఎక్కుపెట్టారు. పార్టీ నిర్వహణకు ఆర్ధిక పోరాటం, ట్రేడ్ యూనియన్ ఉద్యమం సరిపోతుం దనేది ఆర్ధికవాదుల వాదన. సద్యోజనితంగా (స్పాంటేనియస్) ఉద్భవించే కార్మిక పోరాటాలపై ఆర్ధికవాదం ఆధారపడటాన్ని వ్యతిరేకిస్తూ లెనిన్ పోరాడారు. దోపిడీ, పని పరిస్థి తులకు ప్రాధమిక ప్రతిచర్యగా ఆర్ధిక పోరాటాలు(ట్రేడ్ యూనియన్ పోరాటాలు) జరుగుతాయి. ఇటువంటి సద్యోజనితం పోరాటాలు ట్రేడ్ యూనియన్ చైతన్యాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తాయి. ”ప్రపంచంలోని అన్ని దేశాల చరిత్రను పరికిస్తే కనపడేది కార్మికవర్గం కేవలం తన సొంత కృషి ద్వారా అభివృద్ధి చేయగలిగింది ట్రేడ్ యూనియన్ చైతన్యాన్ని మాత్రమే” అని లెనిన్ రాశారు. ”పిండ దశలో” వుండే చైతన్యం ఇది. లెనిన్ ఇంకా ఈ విధంగా చెప్పారు ”విప్లవకారులతో నిండిన శక్తియుత మైన సంస్థ పోరాటాలకు నాయకత్వం వహించకపోతే సద్యోజనితంగా ఉద్భవించే కార్మికవర్గ పోరాటాలు అస లైన ”వర్గపోరాటాలు”గా మారవు. చైతన్యానికి సంబం ధించిన సమస్యపై వాదిస్తూ లెనిన్, సోషలిస్టు చైతన్యం లేక వర్గచైతన్యం అనేది ”బయటనుంచి” చొప్పించబడు తుందనే మరొక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పిన ”ప్రతి వర్గ పోరాటం ఒక రాజకీయ పోరాటమే” అన్నదానిని లెనిన్ నొక్కి చెప్పారు. మార్క్సిజం పునాదిగా వున్న పార్టీయే కార్మిక శ్రేణులలో వర్గచైతన్యం కలిగించగలిగిన ”బయట నుండే” సంస్థ.
నాయకత్వ పాత్ర
లెనిన్ ఆలోచనలో, సోషల్ డెమోక్రటిక్ పార్టీ కార్మి కవర్గ పార్టీ కనుక కార్మికుల చైతన్య స్థాయి, నిబద్ధతకు సంబంధం లేకుండా అందరినీ చేర్చుకునే పార్టీగా వుండ కూడదు. కార్మికవర్గంలో ముందుండి నడిపే పార్టీ దళా న్ని ‘అగ్రగామి’ దళంగా లెనిన్ పేర్కొన్నాడు. ఎక్కువ చైతన్యస్థాయి, మిలిటెంట్ కార్మికులను పార్టీ సభ్యులుగా చేర్చుకోవాలని ఇది సూచిస్తున్నది. వీరు కార్మికుల లోనూ, ప్రజల్లోనూ పార్టీ సంఘాల ద్వారా పని చేయా లి. వృత్తి విప్లవకారుల సంఘంగా పార్టీ ఉండాలి అని లెనిన్ అన్నారు. ”విప్లవ కార్యక్రమాలు వృత్తిగా స్వీకరిం చిన ఉత్తమోత్తములతో కూడిన విప్లవకారుల సంస్థగా పార్టీ ఉంటుంది.” అగ్రగామి నాయకత్వం వృత్తి విప్లవ కారులతో కూడి ఉండాలనే లెనిన్ డి మాండ్ పరిస్థితుల అవసరాన్ని బట్టి నిర్దే శించినది. 1905లో విప్లవం సంభవిం చిన వెంటనే వేలాదిమంది చైతన్యవం తులైన మిలిటెంట్ కార్మికులను పార్టీలో చేర్చుకొనటానికి అంతులేని అవకాశాలు కనిపించాయి. విప్లవ పోరా టం సోషల్ డెమోక్రటిక్ చైతన్యంతో కూడిన కార్మి కులను అనేకమందిని తయారు చేసిందని లెనిన్ గమనించారు. ఆనాటి నుం డి అభివృద్ది చెందుతూ వస్తున్న బోల్షివిక్ పార్టీ వివిధ స్థాయిలలో ధృడమైన వృత్తి విప్లవకారులను కలిగివుంది. వీరితో పాటు పూర్తికాలం కార్యకర్తలు గాని శ్రామిక రంగా నికి చెందిన సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కార్మికవర్గంలో ముందుండి నడిచే దళంతో కూడినదే పార్టీ అని అగ్రగామి అనే భావనకున్న అర్ధం. ”అత్యంత అభివృద్ధికర సిద్ధాంతం కలిగివున్న పార్టీ మాత్రమే పోరాడే అగ్రగామి పాత్రను నెరవేర్చగలదు” అని లెనిన్ స్పష్టం చేశారు.
కమ్యూనిస్టుల పాత్రను కమ్యూనిస్ట్ మేని ఫెస్టో ఈ విధంగా నిర్వచించింది. ”కార్యరంగంలో కమ్యూనిస్టులు అన్ని దేశాల కార్మిక పార్టీలలో ఇతరులందరికంటే చైతన్యవంతులుగాను, ధృడ సంకల్పులుగాను పనిచేస్తారు. ఇతరుల్ని కార్యరంగం లోకి తీసుకొచ్చేవారుగా వుంటారు. సిద్ధాంతరంగంలో కూడా వారే ఇతర శ్రామికులకంటే చక్కగా ఆలోచించే వారు. ఏ మార్గంలో కార్మికోద్యమం పురోగమించాలో, విజయసాధనకేమేమి అవసరమో, ఆ విజయాలవల్ల తుదకు ఎట్టి సాధారణ ఫలితాలు కలుగుతాయో వారే స్పష్టంగా తెలుసుకోగలిగి వుంటారు.మార్క్స్, ఎంగెల్స్‌ల చారిత్రక కమ్యూనిస్టు ప్రణాళికలోని వ్యాఖ్యానం నుంచి లెనిన్ ‘పార్టీ అగ్రగామి’ అనే భావనను తెచ్చారు. అగ్ర గామి అనేది గతితర్కం నుంచి వచ్చిన భావన. రాటు దేలిన కార్మికవర్గ రాజకీయ చైతన్యంగల కార్మికులతో కూడిన పార్టీగా ఉంటుంది. ఈ అగ్రగామి పార్టీ కార్మిక వర్గం కోసం పోరాడటం, మద్దతు తెలపటం వరకే కాక, సమాజంలో అణగదొక్కబడిన అన్ని తరగతుల ప్రజల కోసం పోరాడుతుంది ఇటువంటి అగ్రగామి పార్టీ మాత్రమే వివిధ భాగాలుగా, అనేక పొరలుగా చీల్చ బడిన కార్మికవర్గాన్ని ఐక్యం చేసి, కార్మికవర్గ చైతన్యాన్ని కలిగించగలదు. ఇది మాత్రమే కాదు, విప్లవోద్యమంలో మద్దతు ఇచ్చే ఇతర వర్గాలను, తరగతులను సమీక రించి, పోరాటంలో అభివృద్ధియైన తరగతులను తనలో కి ఇమడ్చుకోవటంలో అగ్రగామిపార్టీ అవసరం వుంది.
కేంద్రీకరణ
అగ్రగామిపార్టీ అనేది కేంద్రీకృత పార్టీగా వుండాలి. పార్టీ పైస్థాయి నుంచి కింది దాకా ఒకే పద్దతిలో కేంద్రీ కృత మార్గంలో వ్యవహరించాలి. జార్ నిరంకుశ ప్రభు త్వం కిందవున్న పరిస్థితులను ఎదుర్కోవటానికి రహ స్యంగా పనిచేసే ఉద్దేశ్యంతో మాత్రమే కేంద్రీకృత పార్టీ ఉండాలని లెనిన్ అనుకోలేదు. ఒక కేంద్రీకృత పార్టీ నాయకత్వం కింద రాజకీయంగా ఏకీకృత పార్టీని అంది చటమే కేంద్రీకృత పార్టీ ఉద్దేశం. పార్టీ రాజకీయ- సంస్థాగత నిర్మాణంలో కేంద్రీకరణ సాధించటానికి స్థానిక ప్రచురణలు కాక, ఒక అఖిల రష్యా దినపత్రిక వుండాల్సిన అవసరాన్ని లెనిన్ నొక్కి చెప్పారు. ”ఒక దినపత్రిక సమిష్టి ప్రచారకుడు, సమిష్టి ఆందోళన కారుడు మాత్రమే కాక, ఒక సమిష్టి నిర్మాణదక్షుడు కూడా” అని లెనిన్ విశదం చేశారు.లెనిన్ దృష్ట్యా, సకల కేంద్రీకృత వనరులతో శక్తివంతంగా వుండే పెట్టుబడి దారీ రాజ్యాన్ని ఎదుర్కోవాలంటే ఒక కేంద్రీకృత పార్టీ ఉండటం తప్పనిసరి అవసరం.
పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం
పార్టీ కేంద్రీకృత సూత్రానికి పార్టీలోని అన్నిస్థాయి లలో ప్రజాస్వామ్య ఆచరణను జత కలపటం జరిగింది. ఏమి చేయాలి? అనే పుస్తకం రాస్తున్న సమయంలో రాజ్యం యొక్క అణచివేత తీవ్రస్థాయిలో ఉండటంతో, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఆచరించటం, అన్ని స్థాయిలలో ఎన్నికలు జరపటం సాధ్యం కాలేదు. దాని తో, కేంద్రీకృత సూత్రం ఆధిపత్యం చెలాయించింది. కానీ, 1905 విప్లవం తరువాత, అధికతమ స్థాయిలో రాజకీయ స్వేచ్ఛ వున్నప్పుడు, పార్టీలోని అన్ని స్థాయి లలో పార్టీ నిబంధనావళి చెప్పిన ఎన్నిక సూత్రాన్ని అమలు చేయాలని లెనిన్ పిలుపునిచ్చారు. కేంద్రకమిటీ అధికారం తగ్గించి, కింది స్థాయిల కమిటీలకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చారు.1906లో రష్యా సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాలుగో మహాసభ నాటికి కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని అందరూ అంగీకరించారు. దానిని పార్టీ నియమాలలో చేర్చారు. కేంద్రీకృత ప్రజా స్వామ్యం అంటే పార్టీ కమిటీలలో విస్తృత చర్చ జర పటం, చర్చ తరువాత తీసుకున్న నిర్ణయాన్ని, ఐక్యంగా అమలు చేయటం.లెనినిస్టు భావనలో పార్టీ ఒక సైనిక సమూహం కాదు. పార్టీలో సిద్ధాంతం, ఆచరణపై ఆంత రంగిక చర్చలకు, వాదనలకు తావులేకుండా చేయటం కాదు. కేంద్రీకృత ప్రజాస్వామ్యం వాదనలకు, చర్చలకు విస్తృత అవకాశం కలిగిస్తూ, కేంద్రీకృత రాజకీయ వైఖరితో పోరాటంలో ఐక్యత కలిగివుండటం.
కేంద్రీకృత ప్రజాస్వామ్యం
లెనినిస్టు పార్టీ సిద్ధాంత సారం కేంద్రీకృత ప్రజా స్వామ్యం. ఒక విప్లవపార్టీ పనిచేసే నిర్దిష్ట పరిస్థితులకి అనుగుణంగా కేంద్రీకృతం, ప్రజాస్వామ్యం కలగలుపుతో ఏర్పడిన చట్రం ఇది. కేంద్రీకృత ప్రజాస్వామ్యం అనేది కేవలం నిర్మాణ అంశం మాత్రమే కాదు, కమ్యూనిస్ట్ పా ర్టీకి అది పునాది అంశం. పెట్టుబడిదారీ విధానం లోపలే పనిచేద్దామనుకునే సోషల్ డెమోక్రటిక్ పార్టీలకు విప్లవకర పార్టీ నిర్మాణ పద్ధతుల అవసరం ఉండదు. ఆ కారణంగా వారికి కేంద్రీకృత ప్రజాస్వామ్యమంటే గిట్ట దు. పెట్టుబడిదారి విధానాన్ని, పాలక వర్గాల వ్యవస్థను కూలదోసి దాని స్థానంలో తప్పనిసరిగా సోషలిజాన్ని స్థాపించాలనుకునే కమ్యూనిస్టుపార్టీ, శక్తివంతమైన రాజ్యాన్ని, దాని అధిపత్య పాలక వర్గాలకు వ్యతిరేకంగా రాజకీయ, సైద్ధాంతిక, సంస్థాగత పోరాటంలో అన్ని విధాలా సన్నద్ధమైన సంస్థగా వుండాలి. అటువంటి పార్టీ పార్ల మెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో పోటీ చేయటానికే కాక, అది ఎంత స్థిరంగా, దీర్ఘ కాలం ఉన్నప్పటికీ ఈబూర్జువాధిపత్య చట్రంలో అందుబాటులో వున్న ప్రజాస్వామిక హక్కులను, సంస్థలను ఉపయోగించుకుంటుంది. కానీ, కీలక మైన ప్రశ్న కార్మికవర్గాన్ని, విప్లవ ప్రజానీకాన్ని సంఘటిత పరచి, విప్లవోద్యమానికి నాయకత్వం వహించటానికి పార్టీ సన్నద్ధమై ఉన్నదా అనేది.
విప్లవోద్యమాన్ని రూపొందించి, అభివృద్ధి చేసే పార్టీని నిర్మించాలనేది లెనిన్ ఊహ. అందు కోసం కార్మికవర్గంలో అభివృద్ధి చెందిన తరగతులను పార్టీలోకి చేర్చుకుని, వారిలో రాజకీయ చైతన్యం కలి గించి, అగ్రగామిగా ఉపయోగపెట్టుకునే ప్రాముఖ్యత గురించి లెనిన్ మరీమరీ చెప్పారు.అటువంటి పార్టీ వర్గ పోరాటాలు, ప్రజాఉద్యమాల ద్వారా ఉక్కులాగా తయా రై,అన్ని పరిస్థితులలోనూ, అంటే చట్టబద్ధ, పాక్షిక చట్ట బద్ధ, చట్టవిరుద్ద పరిస్థితులలో పనిచేయగలగాలి. వర్గ రాజకీయాల ఆపత్కాల పరిస్థితులలో పోరాట రూపా లను మార్చగల సామర్ధ్యం పార్టీకి వుండాలి. మార్క్సిజం, వర్గపోరాటాలు పునాదిగా వున్న పార్టీకి కేంద్రీకృత ప్రజా స్వామ్య సూత్రం చక్కగా సరిపోతుంది. వర్గపోరాటం ఒక సామూహిక చర్య. కేంద్రీకృత ప్రజాస్వామ్యం సమి ష్టిగా నిర్ణయాలు చేయటాన్ని, సమిష్టిగా కార్యక్రమాలు చేయటాన్ని ప్రోత్సహిస్తుంది. అది స్వతంత్ర ఆలోచనను, పోరాటంలో ఐక్యతను అనుమతిస్తుంది
20వ శతాబ్దం రెండోసగంలో విప్లవాలు జరగని కాలంలో అనేక కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్నాయి. 21వ శతాబ్ది తొలి రెండు దశాబ్దాలలో ఈ పరిస్థితి ఇంకా స్పష్టమైంది. అయితే, ఈ కమ్యూనిస్టు పార్టీలు కేంద్రీకృత ప్రజాస్వామ్యానికి కట్టుబడి పనిచేస్తుండ టంతో ఉనికిలో ఉండగలిగాయి. సైద్ధాంతిక-రాజకీయ లోపాలు, పొరపాట్లు ఏమైనప్పటికీ, కేంద్రీకృత ప్రజా స్వామ్యం వాటిని విప్లవ పార్టీగా సజీ వంగా ఉంచింది. కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని విడిచిపెట్టిన పార్టీలు కమ్యూనిస్టు పార్టీలుగా అంతమై పోవటమో లేక విచ్చి న్నమై పోవటమో జరిగాయి. దీనికి చక్కని ఉదాహరణ, ఇటలీ కమ్యూనిస్టు పార్టీ. ఇటలీ కమ్యూనిస్టు పార్టీ 80వ దశకం దాకా, సోషలిస్టు దేశాలకు వెలుపల వున్న అతి పెద్ద కమ్యూనిస్టు పార్టీ. ఈ పార్టీ సోవియట్ యూని యన్ పతనానికి చాలా ముందే కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని వదులుకోవటంతో మొదలైన ప్రయాణం, చివరికీ మార్క్సిజాన్ని కాదనుకోవటంతో ముగిసింది. 20వ శతాబ్దంలో వచ్చిన విప్లవాల చారిత్రక అనుభవం లెనిన్ యొక్క పార్టీ సిద్ధాంతం, కేంద్రీకృత ప్రజాస్వామ్య ఆచరణ సరియైనవని రుజువు చేస్తున్నాయి.
1964లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఏర్పడిన నాడు, అది ఎత్తుగడల పంథాని, పార్టీ కార్యక్ర మాన్ని ఆమోదించింది. దానితో పాటు, కేంద్రీకృత ప్రజా స్వామ్య సూత్రాల ఆధారంగా పార్టీని పునర్నిర్మించాలనే కర్తవ్యాన్ని తీసుకున్నది. ఉమ్మడిపార్టీలో రివిజనిజం కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాన్ని హరించివేసినందు వల్ల దాని అవసరం ఏర్పడింది. ఇది ఒక నిరంతర కర్తవ్యం. భారతదేశంలోని నిర్ధిష్ట పరిస్థితులలో పార్టీని నిర్మించటంలో కలిగిన అనుభవం కేంద్రీకృత ప్రజా స్వామ్యం పునాదిగా పార్టీ నిర్మాణం కొనసాగించటానికి ప్రయత్నించాలని చెపుతున్నది.
అనువాదం : కర్లపాలెం
ప్రకాశ్‌కరత్