పశువులపై చిరుత దాడి..

Leopard attack on cattleనవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని అడెల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం వేళ అడెల్లి తండాకు చెందిన ఆడే మోహన్ కు చెందిన రెండు గొర్రెలు, ఎద్దు పై చిరుత దాడి చేసినట్లు డివైఆరో నజీర్ ఖాన్ తెలిపారు. ఈ విషయం తెలుకున్న జిల్లా ఫారెస్ట్ అధికారి నాగిని బాను  సందర్శించి, తండా వాసులతో మాట్లాడారు. చిరుత నుండి ఎలా రక్షించుకోవాలి, అలాగే చిరుత పులి అడవి లోపలే ఉండేట్లు చర్యలు చేపడుతున్నం అన్నారు. పశువులు,గొర్రెలు నష్ట పోయిన వారికి ప్రభుత్వం తరపున నష్ట పరిహారం ఇప్పిస్తామని వెల్లడించారు. వీరి వెంట ఎఫ్ ఆర్ ఓ  రామకృష్ణ, డివైఆరో సంతోష్,ఎఫ్ ఎస్ ఓ రషీద్ ,అటవీ సిబ్బంది ఉన్నారు.