
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామ బిట్ పరిధి అడవుల్లో చిన్న తరహా బొగ్గుల వాగు సమీపంలోని గోపయ్య కుంట వాగులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది.శుక్రవారం ఉదయం చాపల వేటకు వెళ్లిన కొందరు వ్యక్తులకు చిరుత పాద ముద్రలు కనిపించడంతో వారు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది చిరుత సంచరించినట్టుగా సమాచారం తెలియడంతో బొగ్గులవాగు ప్రాంతానికి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. కోడెఫి రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా లోని రామగిరేఖిల్లా ప్రాతంలో చిరుత సంచరించగా అదే చిరుత ఇటు వైపు రావచ్చని ఆటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. గత రాత్రి బొగ్గుల వాగు సమీపంలో వర్షం కురిసినప్పటికి పాద ముద్రల ఆనవాళ్లు అలాగే ఉన్నాయి అంటే చిరుత ఆప్రాంతంలో ల సంచరించినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.