డిసెంబర్ నెలలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కొరకు ప్రతీ గ్రామంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటి,ఇంటి కి తిరిగి అందరినీ పరీక్షించి శరీరం మీద స్పర్శ లేని, రాగి రంగు లేక లేత గోధుమ రంగు మచ్చలు గుర్తించి వారి పేర్లు నమోదు చేస్తున్నారని డి హెచ్ డాక్టర్ రవీందర్ నాయక్ , రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు అన్నారు. సొసైటీ సహకారంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్యాధికారి తో వ్యాధి నిర్ధారణ చేయించి ఉచితం గా చికిత్స అందచేస్తారు అని తెలిపారు.ఈ సర్వే లో ఆశా కార్యకర్తలు ఇంటింటికి చేరుకొని ప్రజల కాళ్లు, చేతులలో తిమ్మిరి, చేతి లేదా పాదాల వేళ్లు వంకర కావడం, పుండ్లు ఏర్పడ్డాయని తెలుసుకుంటారని చెప్పారు. లక్షణాలు కుష్టు వ్యాధి ని గుర్తిస్తారని చికిత్స పొందక కుండా నిర్లక్ష్యం చేస్తే అంగ వైకల్యం రావచ్చు తెలిపారు. కుష్టు వ్యాధి నిప్రాథమిక దశలో గుర్తించి, అంగవైకల్యం రాకుండా నివారించవచ్చును అన్నారు.ప్రజలు సర్వే కార్యక్రమం లో ఆరోగ్య కార్యకర్తల కు సహాకరించి తగిన చికిత్స పొందాలని సూచించారు. రాష్ట్రంలోనిఅన్ని గ్రామాలలో సర్వే చేస్తారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జాన్ బాబు. సీఈవో లేబర్ సొసైటీ డాక్టర్ ప్రశాంత్ నాయక్, డైరెక్టర్ డాక్టర్ అనురాధ. డిఎం హెచ్ ఓ లు అడిషనల్ డిఎంహెచ్వోస్, డిపిఎంలు జి వి నాయుడు, డి పి యం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.