వికారాబాద్‌ పై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక శ్రద్ధ మర్పల్లి మండలాన్ని మరింత అభివృద్ధి చేద్దాం

రైతుల ఖాతాలో త్వరలో డబ్బులు వికారాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆనంద్‌ కృషి అభినందనీయం తహసీల్దార్‌ కార్యాలయం, బస్టాండ్‌ నిర్మాణానికి కృషి
విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి
నవతెలంగాణ-మర్పల్లి
సీఎం కేసీఆర్‌కు వికారాబాద్‌ నియోజకవర్గంపై ఉద్య మ సమయం నుండి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ప్రతి స మావేశంలో వికారాబాద్‌ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్‌ గుర్తు చేస్తారని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి అన్నారు. శని వారం మండలంలోని కల్కోడలో రూ.2 కోట్ల 74 లక్షల నిధు లతో నిర్మించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను, కోటి రూపా యలతో నిర్మించిన మండల పరిషత్‌ కార్యాలయంను, రూ. 42 లక్షల 20 వేలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని వికారాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లా డుతూ వికారాబాద్‌ ప్రాంతంపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని ప్రతి సమావేశంలో వికారాబాద్‌ను ఆ యన ప్రత్యేకంగా గుర్తుచేస్తారన్నారు. విద్యుత్‌ సబ్‌స్టేసన్‌లో ఈ ప్రాంత ప్రజలకు రైతులకు విద్యుత్‌ సమస్య తీరిం దన్నారు. ఎన్నో ఏళ్లుగా స్థానిక మండల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్న ఎంపీడీవో కార్యాలయ ప్రారంభోత్సవం వారి కల నేటితో తీరిందన్నారు. మండల కేంద్రంలోని శిథి లావస్థలో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయం, బస్టాండ్‌ నిర్మా ణానికి నిధుల మంజూరు కోసం కృషి చేస్తానన్నారు. ఎంపీ ఎమ్మెల్యే కృషితో మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణం పనుల కోసం నిధులు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. వీరి కృషితోనే మండల కేంద్రం లో ఇంటర్సిటీ ట్రైన్‌ నిలుపేది సాధ్యమైందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెంటనే వా రి ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కి ఎమ్మెల్యే ఆనంద్‌ కృషి అభినందనీయం
వికారాబాద్‌ నియోజకవర్గంలో ‘మీతో నేను’ కార్యక్ర మంతో ప్రతి గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు సమస్యలు వివరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ఎమ్మెల్యే ఆనంద్‌ కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు వచ్చే రూ.11 వందల కోట్ల నిధు లను నిలుపుదల చేసి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోం దన్నారు. వచ్చే జూన్‌ 2 నుండి 22 వరకు నియోజకవర్గం లోని ప్రతి మండలం ప్రతి గ్రామంలో రోజుకూ ఒక కార్య క్రమాన్ని ఏర్పాటు చేసుకొని బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా జరుపుకుందామని ఎమ్మెల్యే ఆనంద్‌ నాయ కులకు కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలె క్టర్‌ నారాయణరెడ్డి, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ విజరు కు మార్‌, బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌ పటేల్‌, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు రామ్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు ప్రభాకర్‌ గుప్తా, ఎంపీపీ బట్టు లలిత రమేష్‌, జడ్పీటీసీ మధుకర్‌, వైస్‌ ఎంపీపీ మోహన్‌ రెడ్డి, ఎంపీటీసీ సంగీత వసంత్‌, మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు నాయబ్‌ గౌడ్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లేశం, మండల ప్రధాన కార్యదర్శి రాచన్న, ఉపాధ్యక్షుడు అశోక్‌, యూత్‌ ప్రెసిడెంట్‌ మధుకర్‌, మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు షఫీ, పట్టణ అధ్యక్షుడు గఫార్‌, ఉపసర్పంచ్‌ రాజు, డైరెక్టర్‌ యాదయ్య, సోషల్‌ మీడియా కన్వీనర్‌ వికాస్‌ కుమార్‌, గోపాల్‌ రెడ్డి, ఆయా గ్రా మాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు కార్య కర్తలు పాల్గొన్నారు.