కార్మికుల కర్షకుల పార్టీ సీపీఐ(ఎం) ని గెలిపించండి

నవతెలంగాణ- భువనగిరి:  కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వారి అండగా ఉంటున్న పార్టీ సీపీఐ(ఎం) అని ఆ పార్టీ అభ్యర్థి కొండమడుగు నరసింహ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మాయ కృష్ణ విజ్ఞప్తి చేశారు బుధవారం సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహను గెలిపించాలని కోరుతూ మున్సిపల్ కార్మికులతో మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం నిరంతరం సీపీఐ(ఎం) సిఐటియు పోరాడుతుందన్నారు మార్కెట్లో నిత్యవసర ధరలు పెంచుకుంటూ పాలకులు రాజ్యపాలన చేస్తున్నారని అన్నారు ప్రజలకు విద్యా వైద్యం దూరం చేస్తూ వారిని బానిసలుగా పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. కార్మికుల పట్ల చులకనగా చూస్తున్న పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.  సిఐటియు సీపీఐ(ఎం) కు పూర్తి మద్దతు పలుకుతుందని తెలిపారు. తమ కార్మిక చట్టాలు, హక్కుల కోసం పోరాడే సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి సీపీఐ(ఎం) అభ్యర్థి కొండమడుగు నరసింహులు కల్పించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో  కొండయ్య రాములు, వెంకటేష్, వర్మ, కుమారి, సత్యమ్మ కార్మికులు పాల్గొన్నారు.