అపోహాలను వీడి రక్తదానం చేయాలి ..

Let go of misconceptions and donate blood..నవతెలంగాణ –  కామారెడ్డి

అపోహాలని వీడి రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు పరిహారం కిరణ్ యువకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి బ్లడ్ దోనర్స్ అద్వర్యంలో శనివారం రక్త నిధి కేబీఎస్లో బ్లడ్ నిల్వ లేనందువల్ల శనివారం కామారెడ్డి బ్లడ్ దోనర్స్  అధ్యక్షులు  పడిహర్ కిరణ్ పిలుపు మేరకు  కామారెడ్డి బ్లడ్ దోనర్స్ ఉపాధ్యక్షులు సాయి కిరణ్  బి పాజిటివ్ బ్లాడ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రోజుతో 50 సార్లు రక్తదానం చేయడం జరిగిందనీ,  కామారెడ్డి బ్లడ్ ఆర్గనైజేర్ కమిటీ మెంబెర్ సంగిశెట్టి సంతోష్ O పాజిటివ్ రక్తం ఇచ్చారు. తను ఈరోజుతో 30 సార్లు రక్థధానం చేశారనీ, ఇది చాలా మంచి పరిణామన్నారు.  ఈ కార్యక్రమంలో   కామారెడ్డి జిల్లా టూ వీలర్ వెళ్ఫెర్ అసోసియేషన్  అధ్యక్షులు, మా కామారెడ్డి బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజర్ పడిహార్ కిరణ్, పట్టణ సేకరేటరీ  రాజా, గంగయ్య, జిల్లా కార్యదర్శి పుట్ట చంద్రశేఖర్, సీనియర్ సలహాదారు  రఫిక్ పాల్గొన్నారు.