పట్టు విడుపులు విడిచి బలగంలా మెదలాలి

సిబ్బందితో మాట్లాడుతున్న ఏసిపి జీవన్ రెడ్డి
సిబ్బందితో మాట్లాడుతున్న ఏసిపి జీవన్ రెడ్డి
– హుజురాబాద్ ఏసిపి ఎల్ జీవన్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక

ప్రజలు చిన్నచిన్న సమస్యలపై పట్టువిడుపులకు పోకుండా సామరస్యంగా పరిష్కరించుకొని బలగంలా మెదలాలని హుజురాబాద్ ఏసిపి ఎల్ జీవన్ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కేసుల వివరాలు, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతి భద్రతలే ధ్యేయంగా పోలీసులు పని చేస్తారని, గ్రామాల్లో జరిగే సంఘటనలపై ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ప్రజల సహకారంతో నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తామని, ఇందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన కోరారు. డయల్ 100కు ఉచితంగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆయన వెంట ఎస్సై ఎండి ఆసిఫ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.