కొమరం భీమ్ 84వ వర్ధంతిని విజయవంతం చేయాలి 

Komaram Bheem should have a successful 84th birthday– తుడుందెబ్బ తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్ పోడెం బాబు 
నవతెలంగాణ – తాడ్వాయి 
ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి అమరుడైన గిరిజనుల ఆరాధ్యదైవం కొమరం భీమ్ 84వ వర్ధంతి ఈనెల అక్టోబర్ 30 వ తారీకు, జరుగు కొమరం భీం వర్ధంతిని అందరూ హాజరై విజయవంతం చేయాలని తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర కో- కన్వీనర్ పోడెం బాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మోకాల వెంకటేష్ ఆధ్వర్యంలో, తుడుందెబ్బ అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్ర కో- కన్వీనర్ పొడెం బాబు హాజరై మాట్లాడారు. జల్ జంగిల్ జమీన్ కోసం, ఆదివాసి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వయంపాలన అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కొమరం భీమ్ అని అన్నారు. ఆ మహనీయుని వర్ధంతి ఈనెల 30 వ తారీకు బుధవారం రోజున వెయ్యి మంది ఆదివాసి విద్యార్థులతో, మహిళలతో, తుడుందెబ్బ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరోజు 84వ వర్ధంతికి ఆదివాసి విద్యార్థులు, మేధావులు ఉద్యోగులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కోరగట్ల లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజ నారాయణ. ఉపాధ్యక్షులు పాయం కోటేశ్వరరావు, మండల సలహాదారు తాటి సురేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేష్ తులం దెబ్బ నాయకులు తదితరులు పాల్గొన్నారు.