భాషలను బతికించుకుందాం

Let languages ​​surviveభాష ఉద్యమాలకు ఊపిరి పోస్తుంది. జనవాహినిలో చైతన్య గీతం ఆలాపించే విధంగా దోహదపడుతుంది. అనేక ప్రాంతీయా భాషలకు మాతృక జీవన విధానం, సంస్కృతి, భౌగోళిక అంశాలు, స్థానిక పరిస్థితులు ఇత్యాధి అంశాలు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. మొత్తంగా తెలుగు వెలుగులు, హిందీ కాంతులు, తమిళ, మళయాళి, కన్నడి, కొంకణి, పంజాబీ, అస్సామీ, గోచిపూడి, ఓరియా, మాతృభాషల వెలుగులు చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంటాయి. అందుకే మాతృభాషలోనే మాట్లాడుదాం. భాషలను రక్షించుకుందాం.
ఏ జీవన వ్యవస్థకు అయిన భాష కీలకం… తెలుగు వెలుగులైన .. తమిళ భాషకు ప్రాచీన కళ వచ్చిన.. మరాఠికి మకుటం లేకుండా వెలిగినా.. బంగ్లా భాష వర్ధిల్లినా.. హింది వికసించినా ఆయా రాష్ట్రాల భాష ప్రేమికుల.. ప్రజల ఆకాంక్ష గీటురాయి. తెలుగు వెలుగు నుంచి కొంకణి వరకు.. భాషకు బాటలు వేసే కన్నడీలు.. మళయాళీలు ఇలా ఏ భాష గురించి చేప్పిన భావాలు గుండెలోతుల్లో నుంచి జాలువారుతాయి.. జన చైతన్యానికి నడకలు నేర్పి బాటలు వేస్తాయి. అందుకే భాషలను బతికించుకోవాలి. హింది రాజా భాష. చాలా రాష్ట్రాల్లో హిందికి ప్రామాణికంగా తీసుకొని ప్రజలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకో మాట ఊటంకించాలి. అన్ని భాషలకు మూలం సంస్కృతమని చెప్పాలి. ఆంగ్ల భాషల్లో జనం పరితపిస్తున్నారు. ఆంగ్ల భాష రాకుంటే మనుషులం కానట్టు, ఆంగ్లభాష వస్తే మానవాళి మన చుట్టూ ప్రదక్షణం చేస్తున్నట్టు జనం భావిస్తున్నారు. విశ్వ భాష ఆంగ్లంను నేర్చుకోవాలి. విస్మరించకూడదు. కాని ఆ భాష మోజులో పడి మాతృభాషను విస్మరించకూడదు. ”దేశ భాషలందు తెలుగు లెస్సా” అని 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు చెప్పిన మాట. భాష రాకుంటే భావం తెలువదు… ఆలోచన రాదు. అవగాహన పెరగదు. తమిళ భాషను టచ్‌ చేసినా.. కన్నడను కించ పర్చినా రాష్ట్ర ప్రజలు అగ్ని కణాలై ఎగసి పడుతారు. వారి కున్న భాష ప్రేమ అంత గొప్పది. అత్యధికంగా దేశంలో హింది మాట్లాడే రాష్ట్రాలే ఎక్కువ అయినప్పటికి హింది భాష ప్రేమికులు ఇతర భాషలను కించ పరచిన దాఖలాలు లేవు. భాష వ్యక్తీకరణ ఆచరణ అనుసరణ, ప్రజల జీవన విధానం, వైవిద్యత, నాగరికత, భౌగోళిక పరిస్థితులు, జీవన సరళి, గమ్యం, గమనం, నిర్ధేశిత బాష పరిజ్ఞానం తప్పనిసరిగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది.
భారత నేలలో సెలయేరుల భాషల గమనం సాగుతుంది. దేశంలోని ఒక్కో భాషకు ఒక్కొక్క ప్రాచుర్యం, ప్రాధన్యత ఉంది. ప్రజల మదిలో మేదిలే భావాలు ఆవిష్కరణకు రూపమే భాషలు. దేశంలో దక్షణాది రాష్ట్రాల్లో తెలుగు తమిళం, మళయాళి, కన్నడ, భాష ప్రేమికులు భాష రక్షణ కోసం నిరంతరం పెద్ద పీట వేయడంతోపాటు, భాషను కించ పరిచిన, ఆయా రాష్ట్ర ప్రజలు, నిరసన ప్రతిధ్వని వినిపిస్తారు. అక్షరాలు అగ్ని పర్వతాలు అవుతాయని శ్రీశ్రీ ఉపదేశించారు. విశ్వభాష ఆంగ్లం నేర్చుకోవడం ఎవరు తప్పు పట్టడం లేదు. కాని మాతృభాష ప్రాంతీయ భాషను మరిస్తే ఆ సమాజం సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక చరిత్ర అంశాలను విస్మరించినట్టు అవుతుంది. ఆయా రాష్ట్రాల ప్రగతిలో మాతృ భాషలు ప్రధాన భూమిక పోషిస్తాయి. పండితుల చెప్పినట్టుగా ప్రతి రాష్ట్రానికి భాష కొలమానంగా” నిలుస్తోందని చెప్పాలి. దాదాపు పదకొండు రాష్ట్రాలో హిందీని మాట్లాతున్నారు. ఆయా మాతృభాషల్లో పరిశోధనలు, అధ్యయన పత్రాలు సాహిత్యం, పాటలు, కళరూపాలు, భరతనాట్యం, కూచిపూడి కథక్‌, కథక్‌కలి ఇలా అనేక అంశాలతో భాష ముడిపడి ఉంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు (రిసెర్చ్‌) పత్రాలు ఆంగ్ల మాద్యమంలో సమర్పించి దేశం నుంచి ఆయా రాష్ట్రాల శాస్త్రవేత్తలు, కవులు ఖ్యాతి గడించారు. కానీ మాతృభాషను విస్మరించకుండా అంతర్జాతీయ, జాతీయ వేదికల మీద భాష పరిమళాలు వెదజల్లుతున్నారు. చాలామంది కవులు, రచయితలు, కళాకారులు, మాతృభాషలో రచనలు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కృషి చేశారు. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలకు, సినారే, విశ్వంభరకు జ్ఞానపీఠ్‌ అవార్డులు, మళాయంలో దినాకరన్‌కి, కన్నడంలో గిరీశ్‌ కర్నాండ్‌, హిందీలో గుల్జార్‌నంద్‌ అభ్తర్‌, తమిళంలో ముత్తువేలు, ఇలా అనేక మంది రచయితలు కవులు, మాతృభాషలో రచనలు భాష ఖ్యాతిని నలుదిక్కులా చాటారు. ఒడిషాకు చెందిన రచయిత బంధు, ఉపోద్ఘాతాలన్ని తెలుగునాట, గురజాడ, శ్రీశ్రీ శ్రీనాథుడు, బమ్మెర పోతన, పాలకుర్తి సోమనాథుడు, దాశరథి, ఇలా ఒకరా ఇద్దరా ఆయా ప్రాంతీయ మాతృభాషలో భావోద్వేగాన్ని, చైతన్య స్ఫూర్తిని ఉత్తేజాన్ని రగిలించి చరిత్రలో తమకో పేజీని రాసుకున్నారు. ప్రపంచ భాష చిత్రపటంలో భారతదేశంలోని ప్రాంతీయ భాషలకు ప్రాచీనహోదా కూడా దక్కింది. తమిళ, తెలుగు భాషకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్పించింది. విశ్వవిఖ్యాత బెంగాల్‌ రచయిత విశ్వనాథ్‌ ఠాగూర్‌కు తగ్గ రచనలకు గాను నోబుల్‌ బహమతి దక్కింది. భాష ఉద్యమాలకు ఊపిరి పోస్తుంది. జనవాహినిలో చైతన్య గీతం ఆలాపించే విధంగా దోహదపడుతుంది. అనేక ప్రాంతీయా భాషలకు మాతృక జీవన విధానం, సంస్కృతి, భౌగోళిక అంశాలు, స్థానిక పరిస్థితులు ఇత్యాధి అంశాలు గొప్ప ప్రేరణగా నిలుస్తాయి. మొత్తంగా తెలుగు వెలుగులు, హిందీ కాంతులు, తమిళ, మళయాళి, కన్నడి, కొంకణి, పంజాబీ, అస్సామీ, గోచిపూడి, ఓరియా, మాతృభాషల వెలుగులు చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంటాయి. అందుకే మాతృభాషలోనే మాట్లాడుదాం. భాషలను రక్షించుకుందాం.