సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి

– సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు లక్ష్మి
నవతెలంగాణ -హుజూర్‌నగర్‌టౌన్‌
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నేడు కమ్యూనిస్టుల అవసరముందని ఆ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు లక్ష్మి అన్నారు .బుధవారం హుజూర్‌నగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ, మండల జనరల్‌ బాడీ సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, రైతులు, విద్యార్థులు, మహిళలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాలకులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కొరకు ఏర్పడిన రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్ల తో కట్టిన ప్రాజెక్టు సరైన డిజైన్‌ ఇంజనీరింగ్‌ పర్యవేక్షణ లేకపోవడంతో కుంగిపోయిందని కేంద్ర కేంద్ర నిపుణులు ప్రాజెక్టుని పూర్తిగా తొలగించాలని సూచించార ని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు నీటిపాలు చేసిన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు. నేడు ధన రాజకీయాలు ,మత రాజకీయాలు నడుస్తున్నాయని ధన, మత రాజకీయాలను తిప్పి కొట్టి పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థులను గెలుపించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వి. సైదులు, వేల్పుల వెంకన్న, మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్‌, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం శ్రీను, కౌన్సిలర్‌ ఇందిరాల త్రివేణి, టౌన్‌ కార్యవర్గ సభ్యులు తుమ్మకొమ్మయోన, రేపాకుల మురళి, నర్సింగ్‌ లింగమ్మ, సొసైటీ డైరెక్టర్‌ ఇందిరాల లక్ష్మి, మండల కమిటీ సభ్యులు తంగేళ్ల వెంకటచంద్ర ,నూకల లక్ష్మీనరసింహ, చిన్నం వీరమల్లు, జక్కుల వెంకటేశ్వర్లు, పాశం వెంకట నారాయణ ,తురక వీరయ్య, చింతకుంట వీరయ్య, శీలం సాంబయ్య, జి. శ్రీను, చందాల భిక్షం, నెట్టే వెంకటేశ్వర్లు, అన్నమనేని మాధవరావు, మాటూరి నరసింహ చారి, బొమ్మగాని సైదులు తదితరులు పాల్గొన్నారు.