సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి

సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి– ప్రజా సమస్యలు గాలికొదిలేసిన మోడీ, మమత సర్కార్లు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌
కోల్‌కతా: సీపీఐ(ఎం) అభ్యర్థి సుజన్‌ చక్రవర్తిని గెలిపించాలని కోరుతూ.. ఆదివారం రోడ్‌ షో నిర్వహించారు. పార్టీ పతాకాలు పట్టుకుని ప్రదర్శన చేశారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ అగ్రభాగాన నిలిచి.. పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చారు. సీపీఐ(ఎం)తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మోడీ, మమతా సర్కార్లు ప్రజాసమస్యలను గాలికొదిలేశాయని కరత్‌ ఆరోపించారు. ప్రజల పక్షాన నిలిచే వారికే ఓట్లు వేయాలని పిలుపు నిచ్చారు.