ఈనెల 25 న జరిగే సీపీఐ(ఏం) పార్టీ ఆదిలాబాద్ రూరల్ మండల మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘవులు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని సుందరయ్య భవనంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట రూపకల్పన చేసేందుకే ఈ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల సమగ్ర అభివృద్ధికై, మండలం లోని గిరిజన గ్రామాల అభివృద్ధికై తీర్మానాలు చేయడం జరుగుతుందిన్నారు. రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వసితులకు నష్ట పరిహారం రూ.25 లక్షలు ఇవ్వాలని, సాత్నాల ఎడమ కాలువ నుండి పంట భూములకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి మల్లేష్ జిల్లా నాయకులు హాజరువుతారని తెలిపారు. కావున మండలంలోని ప్రజలు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి స్వామి, నాయకులు ఆశన్న, స్వామి, విష్ణు పాల్గొన్నారు.