వామపక్ష అభ్యర్థులను గెలిపించండి

– దీపాంకర్‌ భట్టాచార్య విజ్ఞప్తి
కొల్‌కతా: ఆర్జీ కర్‌ ఆందోళనల నేపథ్యంలో బెంగాల్‌లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ (ఎం-లిబరేషన్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు, ఆకాంక్షలు ఈ ఉప ఎన్నికల్లో ప్రతిబింబించాలన్నారు. రాష్ట్రంలో టిఎంసి అరాచక పాలనకు, బిజెపి మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వాలని ఆయన కోరారు.