
– పార్లమెంట్ ఎన్నికలలో మతోన్మాద బీజేపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించండి
– ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిలుపు
నవతెలంగాణ – చండూరు
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్న ప్రజల మధ్య ఉంటూ ప్రశ్నించే ప్రజాగొంతుక భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవార గట్టుప్పల మండల పరిధిలోని వెల్మ కన్నె గ్రామంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జహంగీర్ గెలిపించాలని కోరుతూఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎండి జహంగీర్ గత 35 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ త్రాగునీరు సాగునీరు మూసి నదిని ప్రక్షాళన చేయాలని అనేక ఉద్యమాలు పాదయాత్రలు నిర్వహించిన ప్రజానాయకుడు జహంగీర్ అన్నారు.
నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజా పోరాటాలే తన దినచర్యగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి జహంగీర్అని అన్నారు. భువనగిరి గడ్డ కమ్యూనిస్టుల అడ్డా అని కమ్యూనిస్టులు నడయాడిన ఈ గడ్డలో వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ప్రజా నాయకునిగా ప్రజల మన్ననలు పొందిన గొప్ప వ్యక్తి జహంగీర్ అన్నారు. సీపీఐ(ఎం) పార్టీ పోరాటాల ఫలితంగా పేదలకు భూములు ఇండ్ల స్థలాలు సాధించి పెట్టారన్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో దేశ సంపదని ఉన్నతవరకాలకు దోశ పెడుతూ అంబానీ ఆదానిలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్నారని ఆయన అన్నారు. మతం పేరా దేవుళ్ళ పేరా విభజిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నాడని దుర్మార్గమైన పాలనకు గోరి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రజలు మేల్కొలుపు మేలుకోకపోతే భారత రాజ్యాంగాన్ని మార్చి ఆ ప్లేస్లో మనువాదాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రైతాంగం గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడతా ఉంటే నల్ల చట్టాలు తేవాలని చాలా ప్రయత్నాలు చేశాడని, దానికి రైతాంగం వేలాదిమంది దేశ నడిబొడ్డులో 13 నెలల పాటు సుదీర్ఘ పోరాటం తర్వాత దిగివచ్చి ముక్కు చెంపలు వేసుకుని మోడీ దిగివచ్చి నల్ల చట్టాల్ని పోరాట ఫలితంగా వెనక్కి తీసుకున్నాడని ఆయన గుర్తు చేశారు.
నేడు ప్రజలు వాటిని అనుభవిస్తున్నారన్నారు. ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అహర్నిశలు పనిచేస్తున్న జహంగీర్ సుత్తి కోడల నక్షత్రం గుర్తుపైన రాజకీయాలకతీతంగా ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం, సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, సిపిఎం సీనియర్ నాయకులుగోపాల్ రెడ్డి, సీపీఐ(ఎం) చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, పడసబోయిన యాదగిరి, నారా పాక శంకర్ తదితరులు పాల్గొన్నారు.