నవతెలంగాణ- కంటేశ్వర్
బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం లో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,జడ్పీ చైర్మన్ దాదన్నగారి విటల్ రావు ,నగర మేయర్ దండు నీతు కిరణ్ హాజరయ్యారు.ఈ సమావేశాన్ని ఉద్దేశించి గౌ మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతో ఉత్సంగా ఉన్నారని అంతే ఉత్సాహంతో ఎంపీ అభ్యర్థిని గెలిపించు కోవాలి ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం మార్పు కావాలని కోరుకున్నారు. కానీ మూడు నెలల్లోనే మళ్లీ మార్పు కావాలని కోరుకుంటున్నారు. పార్టీ నుంచి వీడిన వారిని గురించి పట్టించుకోకండి నిరుత్సాహపడకండి. పార్టీ కోసం పనిచేసే నాయకులు నీకాసైన నాయకులు ప్రజలకు అండగా ఉంటారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యేలను గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అతి తక్కువ సంఖ్యతో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆర్మూర్, బాన్సువాడ, రూరల్ నియోజకవర్గం లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మన మాస్ లీడర్ ని ఢిల్లీలో గొంతు ఎత్తేలా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. 50 సంవత్సరాలు పరిపాలించిన ఇతర పార్టీ నాయకులు ఏమీ అభివృద్ధి చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పది సంవత్సరాల్లో ఎనలేని అభివృద్ధి చేసి చూపించిన ఘనత మనదే, రెండవసారి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ కు భారీ స్పందన వచ్చింది కెసిఆర్ క్రేజీ ఎక్కడ తగ్గలేదు. ప్రజాసేవ చేయడానికి అందరం ఐక్యమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. మనకు అండగా సిట్టింగ్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు, నగర మేయర్ దండు నీతు కిరణ్ ఉన్నారు.బిజెపి పార్టీ కుల మతాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థి దిక్కులేక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షులు సిర్ప రాజు,మీర్ మాజాజ్ అలీ, నాయకులు సుజీ సింగ్ ఠాగూర్,సత్య ప్రకాష్, సుదాం రవిచంద్రర్, ప్రభాకర్ రెడ్డి,ఎనగందుల మురళి, దారం సాయిలు, నవీన్ ఇక్బాల్, కార్పొరేటర్లు మరియు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.