– రాజకీయాలు వ్యాపార రంగంగా మారాయి
– మైనార్టీల హక్కుల కోసం పనిచేసేది ఎర్రజెండా మాత్రమే
– సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి
– నియోజకవర్గ విస్తత సమావేశంలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్గొండకలెక్టరేట్
నిరంతరం ప్రజా సమస్యలపై పనిచేస్తూ పోరాటపటినగలిగిన నాయకుడు నలగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మిర్యాలగూడ రోడ్డుని ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సీపీఐ(ఎం) నల్గొండ నియోజకవర్గ విస్తతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు ఒక వ్యాపార రంగంగా మారాయన్నారు. పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలనే స్వభావంతో కొన్ని రాజకీయ పార్టీలు డబ్బు బలంతో ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నాయన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అయినప్పటికీ అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ప్రజా సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో రైతులు, కార్మికులు, మహిళలు మైనారిటీల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తున్న ఎర్ర జెండా ముద్దుబిడ్డ ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.
ప్రశ్నించే కమ్యూనిస్టులు అసెంబ్లీలో ఉండాలి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందే విధంగా జరగాలంటే శాసనసభలో కమ్యూనిస్టులు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ ఎర్రజెండా ముద్దుబిడ్డ ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిని గెలిపించండి. సభ్యులు సయ్యద్ హశం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య, నన్నూరు వెంకటరమణారెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, కొండా అనురాధ, మండల కార్యదర్శిలు నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, కందుల సైదులు, పుల్లెంల శ్రీకర్, కానుగు లింగస్వామి, ఎర్ర కన్నయ్య, కుంభం కష్ణారెడ్డి కొండ వెంకన్న, దండెంపల్లి సరోజ, గుండాల నరేష్, భూపాల్, అంజయ్య,మైల యాదయ్య, పాకా లింగయ్య, అరుణ, మధుసూదన్ రెడ్డి, కాసర్ల గౌతమ్ రెడ్డి, ఇస్తారి, మల్లారెడ్డి పాల్గొన్నారు.