ఓటు మనదే సీటు మనదే జాగో

–  బీసీ ఓటు బిసికే రాజ్యాధికారం మనదే

నవతెలంగాణ- మల్హర్ రావు: ఓటు మనదే సిటు మనదే జాగో బీసీ ఓటు బీసీకె అంటే బిసి సంఘాల నాయకులు శుక్రవారం మండలంలోని ఇప్పలపల్లి  గ్రామ పంచాయతీ పరిధిలోని కేసారం పల్లి గ్రామంలో బీసీ కుటుంబ సభ్యులతో కలసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.కులగనన చేసి జనాభా ప్రాతిపదికన చదువుకున్న బిసి విద్యార్థులకు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ కల్పించాలి ఇప్పటికీ దేశంలో వివిధ రాష్ట్రాల్లో 80 శాతం బీసీ కులాల్లో చట్ట సభల్లో ముఖమెరుగని పరిస్థితి నెలకొందన్నారు. అందుకని బీసీ బిడ్డలం అందరం ఏకమై బిసి రాజ్యాధికారం కోసం మంథని ఎమ్మెల్యే బిసి అభ్యర్థి పుట్ట మధుకర్ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీసీ సంఘం నాయకులు విజయగిరి సమ్మయ్య అనిపెద్ది రాంబాబు,బ్రహ్మచారి, బాపు,రమేష్ రవి, గట్టయ్య మల్లేష్, రాజలింగు,లచ్చయ్య,కేశవ చారి  పాల్గొన్నారు.