సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్ సెల్ యూనివర్శ్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ టీజర్ చూసి ఎగ్జైట్ ఫీలయ్యాను. ఇందులో వామ్‌హోల్ అనే కాన్సెప్ట్‌కి బాగా కనెక్ట్ అయ్యాను. మన సనాతన ధర్మానికి ఇది రిలేటెడ్‌గా అనిపించింది. తప్పకుండా ఈ చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘నాకు ‘కార్తికేయ’ సినిమా స్ఫూర్తి. భారతీయ చరిత్రను ఆ సినిమా ద్వారా దర్శకుడు చందు అందరికీ చాటి చెప్పారు. ఈ సినిమా కేవలం మైథాలజీ మాత్రమే కాదు.. రాముడు, హనుమంతుడుకేనా మనకు కూడా జరుగుతుందా అని వేసే ఓ చిన్న పిల్ల ప్రశ్నకు సమాధానంగా ఉంటుంది. నేటి తరం ప్రేక్షకుల మెప్పు పొందే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. తప్పకుండా ఈ చిత్రం అందర్నీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి సర్‌ప్రైజ్ చేస్తుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు కోమల్ ఆర్. భరద్వాజ్ అన్నారు.