నవతెలంగాణ అచ్చంపేట: జర్నలిస్టుల సమస్యలు హక్కుల కోసం ఐక్యంగా పోరాటం చేద్దామని ఐజయు రాష్ట్ర కార్యదర్శి మదు అన్నారు. అచ్చంపేటలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టులకు ఇళ్లస్థల సమస్య పరిష్కారానికి ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కృషి చేస్తారని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేద్దామన్నారు. కార్పొరేట్ ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు తీసుకొచ్చే విధానాన్ని ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రవేట్ పాఠశాలలో జర్నలిస్టులకు ఉచిత విద్య అందించే విధానానికి జీవోలు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు సీనియర్ జర్నలిస్టులు మూడవ రాములు, పవన్, అన్నయ్య తదితరులు ఉన్నారు.