మున్నూరు కాపుల డిమాండ్ల పరిష్కారానికి ఐక్యమత్యంగా పోరాడుదాం

– ప్రభుత్వానికి మున్నూరు కాపుల సత్తా ఏమిటో చూపిద్దాం

నవతెలంగాణ- మద్నూర్
తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మున్నూరు కాపుల డిమాండ్ల పరిష్కారం కోసం ఐక్యమత్యంగా పోరాడడమే డిమాండ్ల పరిష్కారానికి మార్గమని మద్నూర్ మండల మున్నూరు కాపుల సంఘం అధ్యక్షులు సారంగుల గంగారాం సార్ పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో గల మున్నూరు కాపుల పెద్దల ప్రత్యేక సమావేశం బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నాడు నిర్వహించగా ఈ ప్రత్యేక సమావేశంలో మద్నూర్ మండలానికి చెందిన సారంగుల గంగారాం సార్ మాట్లాడుతూ.. మున్నూరు కాపుల పట్ల ప్రభుత్వం దిగివచ్చే వరకు ఐక్యమత్యంగా పోరాడదాం అని పిలుపునిచ్చారు. ఈ ప్రత్యేక సమావేశానికి మద్నూర్ మండలంలోని మద్నూర్, పెద్ద తడగూర్, పెద్ద షక్కర్గా, డోంగ్లి, హెచ్ కేలూర్, తదితర గ్రామాల నుండి మున్నూరు కాపు పెద్దలు బిచ్కుందలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి తరలి వెళ్లారు తరలి వెళ్లిన వారిలో డాక్టర్ బండి వార్ విజయ్, కొండ గంగాధర్, మున్నూరు శంకర్, ఆయా గ్రామాల ప్రముఖ నాయకులు తరలిన వారిలో ఉన్నారు.