తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాడుదాం…

Let's fight with the spirit of Telangana armed struggle...– కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్)మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో నేటి తరానికి తెలిసేలా ఆ వారసత్వాన్ని కొనసాగిద్దాం అని సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సూర్యాపేట నుండి కడవెండికి ఎర్ర జెండాలతో మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావుపూలే విగ్రహం వద్ద షేక్ బంధగి చిత్ర పటానికి పూలమాల వేసి అమర వీరులకు జోహార్లు అర్పించి మోటార్ బైక్ ర్యాలీగా బయలుదేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నేటి పాలకులు వక్రీకరిస్తూ తప్పుడు పద్ధతుల్లో తెలంగాణ పోరాటాన్ని ప్రచారం చేస్తుంటే దాన్ని ఖండిస్తూ సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 18 వరకు తెలంగాణ సాయుధ పోరాటా ప్రాముఖ్యతను చాటి చెప్పాలని ఈరోజు కడవెండి గ్రామానికి బయలుదేరి అక్కడ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు దొడ్డి కొమరయ్య విగ్రహం వద్ద జోహార్లు అర్పించి అక్కడి నుంచి బంధగి స్థూపం వద్దకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ప్రజలకు తెలిపారు.కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఎర్ర జెండా పట్టి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగాలు చేసి మూడువేల గ్రామాలను విముక్తి చేశారన్నారు. ఈ సమయంలో పటేల్ నెహ్రూ సైన్యం నైజాం నవాబుని లోబర్చుకుని తెలంగాణ ప్రజల మీదికి వారి సైన్యాన్ని పంపిస్తే మహిళలు,పిల్లలు అనే తేడా లేకుండా తెలంగాణ ప్రజల్ని 4,000 మందిని అతి కిరాతకంగా ఊస కోత కోశారు అన్నారు. అలాంటి నీచమైన చరిత్రని తెలంగాణ విలీనం,విమోచన పేరు తోటి పాలకులు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు.తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణని భారతదేశం లో కలిపిన సెప్టెంబర్17 విలీనం,విమోచన కాదు ముమ్మాటికీ అది విద్రోహ దినమే అని దీనిని మాస్ లైన్ పార్టీ కార్యకర్తలు అన్నిచోట్ల జరిపి ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, పిఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, గొడ్డలి నర్సయ్య, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, నాయకులు కరుణాకర్,మహేష్, సంతోషి, రేణుక తదితరులు పాల్గొన్నారు.