– జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ & సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు
నవతెలంగాణ – కంటేశ్వర్
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్మిక రైతు హక్కులను కాపాడుకుందాం అని, ఆగస్టు 14 అర్ధరాత్రి వరకు జన జాగరణను జయప్రదం చేయాలని జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అండ్ సంయుక్త కిషన మోర్చా పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆగస్టు 14 న రాత్రి 8 గంటలకు సాయి రెడ్డి పెట్రోల్ బంకు వద్ద భగత్ సింగ్ విగ్రహం వద్ద, కాగడాల ప్రదర్శన ఉంటుంది. జన జాగరణ ను కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జాయింట్ ఫ్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ & సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చాయి .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివ మాట్లాడుతూ.. మోడీ, మాట్లాడుతూ ప్రభుత్వం సామాన్యులకు మాటల్లో, సంపన్నులకు కార్పొరేట్లకు మూటలు వడ్డించే విధంగా మోడీ ప్రభుత్వం కేంద్రంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని. అత్యంత కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వలేదని, అన్ని రంగాల్లో కార్పొరేట్లకే పెద్దపీట వేసిందని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించకుండా పటిష్ట పరిచే చర్యలు నిర్దిష్టంగా ప్రకటించలేదని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటికరణల్లో భాగంగానే సింగరేణి 61 బ్లాక్ లను ప్రైవేటు సంస్థలు కట్టబెట్టే ప్రక్రియను చేపట్టిందని, అందులో భాగంగానే తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన సింగరేణి శ్రావణపల్లి బ్లాకును( మంచిర్యాల వేలం వేయడానికి సిద్ధపడిందని తెలియజేశారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి లాభం చేకూర్చే ఏ చర్య తీసుకోకుండా ,మోడీ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని. స్కీం వర్కర్స్ ను కార్మికులుగా గుర్తించలేదని,అసంఘటితరంగ కార్మికుల సంక్షేమం పట్టించుకోలేదని రైతులకు కనీస మద్దతు ధర గ్యారెంటీ ఇవ్వలేదని, సుదీర్ఘ రైతు పోరాట ఫలితంగా రద్దు చేసిన రైతు చట్టాలను హామీ మేరకు నిర్దిష్ట చర్యలు తీసుకోలేదని, గ్రామీణ ఉపాధి హామీని బలోపేతం చేసే రకంగా చర్యలు చేపట్టలేదని, అనేక త్యాగాలు, రక్త తరుపనతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మారుస్తూ పార్లమెంట్లో చట్టం చేసిందని, వేతనాలకోడు చట్టంతో కనీస వేతనాలు నిర్ణయించే మౌలిక విధానానికి తూట్లు పొడిచిందని పార్సామిక సంబంధాల కోడ్ చట్టంతో సమ్మె హక్కును కాలరాస్తుందని అన్నారు. సామాజిక భద్రత కోడు వృత్తి సంబంధ రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్లతో పిఎఫ్, ఈఎస్ఐ, వెల్ఫేర్ బోర్డ్ లపై గొడ్డలి వేటు వేస్తుందని, తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తుందని. కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెరిగి దోపిడికి హద్దే లేకుండా ఉందని సుమారు 40 కోట్ల మంది అసంఘటితరంగా కార్మికులకు ఈ లేబర్ కోడ్లతో బానిసత్వంలోకి నెడుతుందని తెలిపారు. ప్రభుత్వ స్కీముల్లో కోటి మంది స్కీం వర్కర్లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనానికి నోచుకోవడం లేదని, ఇండియన్ లేబర్ కాంగ్రెస్( ఐ ఎల్ సి) కార్మిక సంక్షేమం కోసం గతంలో చేసిన తీర్మానాలన్నీ చిత్తుకాగితాలకే పరిమితమైనాయని, వారు విమర్శించారు.కార్మిక, రైతు, వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను సవరించాలని. దేశంలో అత్యధిక ధనవంతులకు కార్పొరేట్ వర్గాలకు ఆదాయ సంపదపై టాక్స్ పెంచి విద్యా ఆరోగ్యం వ్యవసాయ రంగాల కేటాయించాలన్నారు.
నాలుగు లేబర్ కోడ్లను విద్యుత్ సవరణ బిల్లును 2002 రద్దు చేయాలని, 73 షెడ్యూల్డ్ పరిశ్రమల జి వో లను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, బొగ్గు బ్లాకులు వేలం వేయడాన్ని నిలుపుదల చేయాలని, సింగరేణికే నేరుగా గనులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు 26,000 కనీస వేతనం అమలుపరచాలని ప్రతి ఒక్కరికి పిఎఫ్, ఈఎస్ఐ ,గ్రాటిటీ పెన్షన్ ఇవ్వాలని రోజుకు ఉపాధి కూలీలకు 600 కూలి ఇవ్వాలని, ఇన్కమ్ టాక్స్ పరిధిలో లేని అసంతరంగా కార్మికులకు 7500 నెలకు జీవన భృతిగా చెల్లించాలన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ దారులకు కనీస పెన్షన్ తొమ్మిది వేలకు తగ్గకుండా చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కార్మికులకు అయ్యర్ పెన్షన్ చెల్లించాలని, అసంఘటిత కార్మికులను యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ స్కీములు ప్రవేశపెట్టాలన్నారు. ధరలకు పెరుగుదలకు అరికట్టాలని. ఆహార వస్తువులు మరియు నిత్యవసర వస్తువులపై జిఎస్టి వుపసoహరిoచాలని, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్ పై కేంద్ర ఎక్సైజ్ సుఖాన్ని గణనీయంగా తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను విస్తరింప చేయాలని 14 ముఖ్యమైన నిత్యవసర వస్తువులు చేరిచి దాని పరిధిలోకి విస్తరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు వెంకటి ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.