అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా మహనీయుడిని స్మరించుకుందాం..


నవతెలంగాణ -పెద్దవూర
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ.. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారని ఆయన వర్ధంతి సందర్బంగా బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి ఆయన సేవలను కొనియాడారు.