కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ విధానాలను ప్రతిఘటిదాం


– ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె
– గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి..
– ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్..
నవతెలంగాణ -భువనగిరి: కేంద్రలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశంలో కార్మిక, రైతు, సమాన్య ప్రజలను విస్మరించి బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనం కోసం ఎర్ర తివాచీ వేసి పాలన కొనసాగిస్తుంది అని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ఆరోపించారు. గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముద్రించిన సమ్మెకు సంబందించిన గోడ పత్రికలను ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పరెట్ సంస్థల కోసం మోడీ ప్రభుత్వం 2.14 లక్షల కోట్ల బ్యాంకు అప్పులు మాఫీ చేసిందని, 2019నుండి 2022 వరకు 1 శాతం ఉన్న బడా వర్తకుల ఆదాయం 30 శాతం అభివృద్ధి అయందన్నారు.
కార్మికులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం స్కీమ్ వర్కరల కు కనీసవేతనం 26 వేలు ఇవ్వాలి అని, ఆటో డ్రైవర్లకు జీవనభృతి నెలకు పదివేలు ఇవ్వాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. మోడీ పాలనలో జరిగిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు వలన జరుతున్న నష్టం పై ఫిబ్రవరి 16 న దేశ వ్యప్తంగా సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు, రైతులు సమ్మె లో పాల్గొని జయప్రదం చేశాల అందరూ కృషి చెయ్యాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, నాయకులు ఎడ్ల నరేష్, జిన్న కృష్ణ, పాండు, రమేష్, ఉపేందర్, రామకృష్ణ పాల్గొన్నారు.