కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను సాధిద్దాం..

– సీపీఐ (ఎం ) ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య 39 వర్ధంతి..
– సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణ కేంద్రంలో సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆదివారం  భారత కమ్యూనిస్టు పార్టీ  ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి, అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రముఖ కమ్యూనిస్ట్ యోధుడు ,తెలంగాణ  రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖుడు అని కొనియాడారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య  ఆనాటి కాలంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ,కుల వివక్షతకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అని అన్నారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించి తనకున్న భూములను పేదలకు పంచిన మహోన్నతమైన వ్యక్తి, తనకు పిల్లలు వద్దని సమాజమే తన పిల్లలని భావించి,సమాజ శ్రేయస్సే ముఖ్యమని భావించిన గోప్ప వ్యక్తి సుందరయ్య ని తెలిపారు. సుందరయ్య  ఆశ సాధనను ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ(ఎం) గా సుందరయ్య పోరాటాన్ని పునికి పుచ్చుకొని పేద ప్రజలు కార్మికులు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జవ్వాజి విమల, ముక్తికాంత అశోక్, మల్లారపు ప్రశాంత్, సీఐటీయూ నాయకులు గుర్రం అశోక్, నాయకులు ఎలిగేటి రాజశేఖర్, చిలుక బాబు తోపాటు తదితరులు పాల్గొన్నారు.