చైనా మాంజను నిషేధించి పర్యావరణాన్ని కాపాడుదాం

– డివైఆర్ఓ నజీర్ ఖాన్
 నవతెలంగాణ సారంగాపూర్: చైనా మంజను నిషేధించి  పర్యావరణాన్ని కాపాడుదాం అని డివైఆర్ఓ  నజీర్ ఖాన్ అన్నారు గురువారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు  సంక్రాంతి పండుగ పురస్కరించుకొని  అవగాహన కల్పించారు ఈ సందర్బంగా సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులు గాలి పాటలను ఎగురవేయు సమయంలో  ప్రమాదకరమైన చైనా మాంజను దారాలతో ప్రమాదాలు జరుగుతాయని వాటి జోలికి పోకుండా సాధారణ దారాలతో గాలి పటాలను ఎగురవేయలని సూచించారు ముందుగా అందరికీ  సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుల,ఎఫ్బిఓ లు వెన్నెల,సుజాత,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.