చేసిన అభివృద్ధిని ధైర్యంగా చెప్పుకుందాం

– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ధైర్యంగా చెప్పుకుందామని ఎమ్మెల్యే మం చిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో బీఆర్‌ఎస్‌ మండల, మున్సిపల్‌ అధ్యక్ష, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. యాభై సంవత్సరాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది శూన్యమని విమర్శించారు. ఆనాడు ఏమీ చేయని వారు రేపు ఏదో వేస్తామని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు నిజాయితీగా ఏ మేలు జరుగాలన్నా అది ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమని, ఈ వాస్తవం ప్రజలందరికీ తెలుసన్నారు. మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మెన్‌ కొత్తకుర్మ సత్త య్య, సీనియర్‌ నాయకులు జక్కరాంరెడ్డి, చక్రవర్తిగౌడ్‌, కళ్లెం ప్రభాకర్‌రెడ్డి, మండల పార్టీఅధ్యక్షులు రమేష్‌గౌడ్‌, బుగ్గరాములు, చిరాల రమేష్‌, మున్సిపల్‌ అధ్యక్షులు కొప్పు జంగయ్య, సిద్దంగా కృష్ణారెడ్డి, అల్వాల వెంకటరెడ్డి, అమరేందకర్‌రెడ్డి పాల్గొన్నారు.