అంతరాలు లేని సమాజాన్ని నిర్మిద్దాం అని సీపీఐ ఎంఎల్ డివిజన్ కార్యదర్శి బి దేవారం అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే ఏర్పాటుచేసిన సత్యశోధక్ సమాజ్ నేటికీ152 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మండలంలోని అమీనాపూర్ గ్రామంలో ఆదివారం కుల నిర్మూలన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సబ్ డివిజన్ నాయకులు రమేష్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగ విచ్చేసిన డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ మహా త్మా పూలే సావిత్రిబాయి పూలే ఈ సమాజ మార్పు కోసం కులాలు లేని నవ సమాజం కోసం, అంతరాలు లేని వ్యవస్థ కోసం, పోరాడారు.అగ్రవర్ణాలకు ఎదురుగా నిలబడి మతోన్మాదులను ఎదిరించి అందరికీ విద్యా అవసరం అని వారి జీవన విధానంలో మార్పు కోసం అందరికీ చదువు ఉండాలని ఆలోచించారు. దేవుడి పేరుతో మతాల పేరుతో కులాల పేరుతో ప్రజల పైన అసమానతలు అంటరానితనాల అమలుపరిచే బ్రాహ్మణ వ్యవస్థను ఆయన ప్రశ్నించారు. కులాంతర వివాహాలు వర్ధిల్లాలని , కులం కుళ్ళు నశించాలని సత్యశోధక్ వ్యవస్థ ను ఏర్పాటు చేసి కులమంటే కుళ్ళు రా మతం అంటే మత్తుర కుల మతాల ఎత్తులో దోపిడీల చిత్తుర అనే విధంగా నినాదించారని వారు తెలియజేశారు. మారుతున్న కాలంతో తో పాటు మనం కూడా మారాలి లేకపోతే అన్ని రంగాల్లో వెనుకబాటు పడుతుం విద్యా వైజ్ఞానిక రంగంలో వెనకబడుతం, అంధకారం లో ఉండిపోయాం, అని ఆనాడే మహాత్మ పూలే చెప్పారు. అయినా నేటి కూడా మనము అంధకారంలో ఉంటే విద్య వైజ్ఞానికంగా ఆలోచించడం లేదు ఇకనైనా మనం మారాలి , ఆలోచించాలి, మహాత్మ పూలే ఆచరణ మనం అనుసరించాలి అని అన్నారు. కావున మనం అందరం మహనీయుల ఆలోచన దారిలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా డివిజన్ నాయకులు రాజేశ్వర్, రాజన్న, అరవింద్, రామన్నపేట అంబేద్కర్ గ్రామ ప్రధాన కార్యదర్శి బాబురావు, అమీనాపూర్ మాజీ సర్పంచ్ ఆకుల రాజేశ్వర్,ఇరవేణి గణేష్, సత్యం, ఆమోస్,రాజు గౌడ్, గంగాధర్, సూరజ్, ఇస్తారి రాజు, జ్యోతి స్వరూప, పద్మ, సునీత, తదితరులు పాల్గొన్నారు.