
పరిసరాల పరిశుభ్రత స్వచ్ఛ గ్రామాల నిర్మించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేద్దామని ప్రత్యేక అధికారి బాబు నాయక్, ఎంపీడీవో బాలయ్య, తహసిల్దార్ దివ్య అన్నారు. సోమవారం రాయపోల్ మండల పరిధిలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈనెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఐదు రోజులు గ్రామలలో ర్యాలీలు నిర్వహించాలనీ, నీటి నిల్వ ప్రాంతాలు వీధి కుక్కలను ఇంకుడు గుంతలను మొక్కలు నాటు ప్రదేశాలను ఫీవర్ సర్వే ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇంటింటికి తిరిగి సామూహిక ప్రదేశాలలో ఇంకుడు గుంతలు గుర్తించడం, ఉపయోగించుటకు అవగాహన కల్పిస్తామన్నారు. నీటి నిల్వ ప్రదేశాలు, చిన్నపాటి గుంతలు, మురికి కాలువలు, నీటి నిల్వను పరిశుభ్రత పాటించేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధుల పైన అవగాహన కల్పించాలి. వనమోత్సవం కార్యక్రమము ప్రభుత్వ కార్యాలయాలు, సామూహిక ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమం ఇంటింటికి మొక్కలు పంచె కార్యక్రమం జరుగుతుందన్నారు. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు అన్నింటిని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవో రాములు, ఏపీఎం వై ప్రసాద్ రావు, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సీసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, అంగన్వాడి టీచర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.