జనవరి 21న ఆశా వర్కర్ల సమస్యలపై జరిగే పాదయాత్రను జయప్రదం చేద్దాం ..

Let's celebrate the march on January 21 on the issues of Asha workers..– పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలి 

– ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి

– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జనవరి 21న ఆశా వర్కర్ల సమస్యలపై జరిగే పాదయాత్రను జయప్రదం చేద్దాం అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల సమస్యల పైన జనవరి 21న పాదయాత్ర బోర్గం బ్రిడ్జి నుండి ధర్నా చౌక్ కొనసాగుతది. అనంతరం ముగింపు ధర్నాచౌక్ లో ఉంటుంది. పాదయాత్రకు జిల్లావ్యాప్తంగా ఆశ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. జనవరి 21న ఆశా వర్కర్ల సమస్యలపై జరిగేమహా పాదయాత్రను జయప్రదం చేయాలనీ ఆమె అన్నారు.రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బిఆర్ఎస్ కంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఆశాల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఆశాల సమస్యలు మాత్రం నేటికీ పరిష్కారం చేయలేదు. ఈ కాలంలో ఆశాలకు ఫిక్సిడ్ వేతనం రూ.18,000/- లు నిర్ణయం చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరంచాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు మరియు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆశాలు అనేకసార్లు వినతిపత్రాల ద్వారా విజ్ఞప్తులు చేశారు. ఇప్పటికీ నిరంతరం నిరసనలు, పోరాటాలు నిర్వహిస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేనట్లు వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితిలో ఆశాల సమస్యల పరిష్కారం కోసం జనవరి 21న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు మహాపాదయాత్ర ఉంటుంది ఈ పాదయాత్రను ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నార.ఈ కార్యక్రమంలో స్వప్న శోభ రేణుక రాధా గంగామణి లలిత తదితరులు పాల్గొన్నారు.