వంటగది ఇంటికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం.. ఇది మన ఇంటికి గుండె వంటిది.. కాబట్టి వంటగదిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవడం అందరి కర్తవ్యం. ముఖ్యంగా పురుగులు, కీటకాలు వంటింట్లోకి రాకుండా చూసుకోవాలి.. బల్లులు, బొద్దింకలు, చీమలు మొదలైన ప్రమాదకరమైన కీటకాలన్నింటినీ దూరంగా ఉంచడం సవాలుతో కూడుకున్న పని. వాటిని తరిమేయడానికి ఉపయోగించే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం…
గుడ్డు పెంకులు
బల్లులను నివారించడానికి, వంటగదిలో ఒక మూలలో 2-3 గుడ్డు పెంకులను ఉంచండి. వాటి వాసనకు బల్లులు పారిపోతాయి. వారానికి రెండు మూడు సార్లు గుడ్డు పెంకులను మారిస్తే సరిపోతుంది.
దోసకాయ
బల్లులకు దోసకాయ వాసనను తట్టుకోలేవట. ఒక దోసకాయను కట్‌చేసి దాని ముక్కలను వంటగదిలోని ప్రతి మూలలో ఉంచాలి. దోసకాయ యొక్క సువాసన మీ వంటగదికి మంచి వాసన కలిగిస్తుంది… అలాగే బల్లులను దూరం చేస్తుంది.
కాఫీ
బల్లులను దూరంగా ఉంచడానికి కాఫీ కూడా సహాయపడుతుంది. దీని కోసం మీరు కాఫీ పొడిని పొగాకుతో కలిపి వంటగదిలోని ప్రతి మూలలో ఉంచాలి. పొగాకు మరియు కాఫీ వాసన ఉన్న ప్రదేశాల నుండి బల్లులు పారిపోతాయి.
నిమ్మకాయ
సిట్రస్ పండ్ల వాసన బల్లులకు అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి బల్లులను తరిమికొట్టాలంటే స్ప్రే బాటిల్లో నిమ్మరసం కలిపి వంటగది అంతా స్ప్రే చేస్తే సరిపోతుంది. ఈ స్ప్రే యొక్క సువాసన మీ వంటగదికి చక్కని సహజమైన సువాసనను కూడా ఇస్తుంది.
లవంగాలు, వెల్లుల్లి
వెల్లుల్లి, లవంగాల బలమైన వాసన బల్లులను వంటగది నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని కోసం మీరు ఈ హ్యాక్‌ని అనుసరించాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచి, వాటిలో లవంగాల పొడిని వేయాలి. ఈ పేస్ట్‌ను బల్లులు ఉన్న ప్రదేశాలలో మరియు వంటగదిలోని ప్రతి మూలలో ఉంచాలి. అంతే బల్లులు వెంటనే అక్కడ నుండి కనుమరుగవుతాయి.