ఇలా శుభ్రం చేద్దాం…

మన ఆహ్లాదం, ఆరోగ్యం వంటింటి శుభ్రత తోనే సాధ్యం. ఇంట్లో వస్తువులు వివిధ రకాల పాత్రలు ఎప్పటికప్పుడు కడిగి మురికి చేరకుండా చూసుకోవాలి. దీనికి మార్కెట్లో లభ్యమయ్యే సబ్బులు, పౌడర్లతోపాటు కొన్ని చిట్కాలు కూడా అవసరం.
టీకప్పులు, చిన్న జాడీలు, సున్నితమైన గాజు, పింగాణీ వస్తువులను శుభ్రపరిచేప్పుడు సింకు అడుగున ఒక పాత బట్టని అమర్చుకో వడం మరవద్దు. ఎ
క్రాకరీ ఇంటి అందాన్ని మరింత ఇనుపడింపజేస్తాయనడంలో సందేహం లేదు. మరి అవి మరింత కాంతిని సంతరించుకోవాలంటే మామూలుగా కడిగిన వస్తువులను ఒకసారి ఉప్పు కలిపిన మంచినీటిలో ముంచి తీయాలి.
రాగి వస్తువులు కొత్తవాటిలా మెరవాలంటే వాటిని కడిగేప్పుడు క్లీనింగ్‌ పౌడర్‌కు కాస్త సిట్రిక్‌ యాసిడ్‌ జత చేయాలి.
బౌల్స్‌, జ్యూస్‌ జార్స్‌ లాంటి గ్లాసు వస్తువులను ఉప్పు కలిపిన నీటితో రుద్ది కడగాలి.
జిగురు (గమ్‌)తో అంటించిన స్టిక్కర్లు, తుప్పు మరకలు లాంటివి తొలగించడానికి వాటిని కిరోసిన్‌లో కాసేపు నానపెట్టి ఆ తరువాత శుభ్రపరచుకోవాలి.
టీ కప్పు లోపల అడుగు భాగం, స్పూను, గరిటల వంపులు – సులభంగా శుభ్రపరచలేని ఇలాంటి వాటిలో మరకలు పడకుండా ముందుగానే జాగ్రత్తగా మెలగడం అవసరం. అవి తొలగించడానికి క్లీనింగ్‌ సోప్‌తోపాటు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి.