చలో హైదరాబాద్ మాలల సింహ గర్జనకు తరలిరావాలి 

Let's come to Hyderabad Malala Lion's Roar– వర్గీకరణ పేరుతో జాతిని విడగొడుతున్నారు 

– విడిపోతే చెడిపోతాం కలిసి ఉంటే రాజ్యం వస్తుంది 
– రాజాధికారమే అంతిమ లక్ష్యం 
– ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో- కన్వీనర్ నిరడి లక్ష్మణ్ 
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
డిసెంబర్ 1న చలో హైదరాబాద్కు మాలలందరూ సింహ గర్జన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలి రావాలని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ నిరడి లక్ష్మణ్ గురువారం అన్నారు. మండల కేంద్రంలోని మాల సంఘంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ నిరడి లక్ష్మణ్ మాట్లాడుతూ డిసెంబర్ 1 నా హైదరాబాద్ ఫెయిల్యూర్ గ్రౌండ్లో నిర్వహించే మాల సింహగర్జన కార్యక్రమానికి ఉద్యోగులు విద్యార్థులు కార్యశకులు కార్మికులు మహిళలు మేధావులు న్యాయవాదులు డాక్టర్లు ఇంజనీర్లు జర్నలిస్టులు వ్యాపారవేత్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కొంతమంది మను వాదులు వర్గీకరణ పేరుతో జాతిని విడగొడుతున్నారని అన్నారు. ముఖ్యంగా మాదిగ సోదరుల గమనించవలసిన విషయం ఏమిటంటే మాల మాదిగ ఎస్సీ కులాలన్నీ కలిసి ఉంటే రాజ్యం వస్తుందని, విడిపోతే చెడిపోతామని అన్నారు. ఆనాడు డాక్టర్ అంబేద్కర్ రాజ్యాధికారమీ అంతిమ లక్ష్యమని అన్నారని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఎస్సీ కులాల మధ్య కులాల మధ్య చిచ్చు పెడుతూ మనకు రాజ్యాధికారం రాకుండా చేస్తున్నారని, ఇప్పటికైనా మాల మాదిగ ఎస్సీ కులాలన్నీ కూడా కలిసి ఉంటే రాజ్యాధికారం మనదేనని రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. రెండు వర్గాల మధ్య పోరాటం జయప జయపాల కు దారితీస్తుందని ఒకే వర్గం మధ్య పోరాటం ఆ వర్గ నాశనానికి దారి చూస్తుందని ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించారని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం రిజర్వేషన్లను కాపాడుకుందాం అని అన్నారు. డిసెంబర్ 1న జిల్లా వ్యాప్తంగా అన్ని కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు హాజరై ప్రభుత్వానికి మాలల సింహ గర్జన తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కో కన్వీనర్లు కేశ్ పల్లి రవి, సిద్ధం రాజేందర్, జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు  విజయ్ కుమార్ మాల మహానాడు నాయకులు, జక్రాన్ పల్లి మాల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.