అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం

 నవతెలంగాణ జన్నారం:
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించుదామని అంబేడ్కర్ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు చిట్టిమల్ల భరత్ కుమార్ అన్నారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్   అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగ పలాలు అందించిన మహా నాయకుడు అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ బీసీ సంఘం  జిల్లా నాయకులు కోడూరు చంద్రయ్య బోర్లకుంట ప్రభుదాస్ ముజాఫర్ అలీ ఖాన్ దాముఖ కరుణాకర్, తాళ్లపల్లి రాజేశ్వర్ ఇందయ్యా రమేష్ నరస గౌడ్, లక్ష్మీనారాయణ, బెంజిమెన్, ప్రభుదాస్ శ్రీనివాస్ గౌడ్ రాజన్న ఫసియుల్లా జనార్ధన్ ప్రభుదాస్ కుమార్ స్వామి జంగం రవిప్రశాంత్ ప్రవీణ్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.