సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆశయాలను కొనసాగిద్దామని ఆ పార్టీ జన్నారం మండల కార్యదర్శి కనికారం అశోక్, నాయకుడు గుడ్ల రాజన్న అన్నారు. శుక్రవారం మండలంలోని సుందరయ్య నగర్ కాలనీలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతారాం ఏచూరి పార్టీకి చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృతి సీపీఐ(ఎం) పార్టీకి తీరని లోటు అని అన్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి ప్రవేశం చేసి పార్టీలో సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తి ఏచూరి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కూకటికారి బుచ్చయ్య కొండ గొర్ల లింగన్న, అంబటి లక్ష్మణ్, మగ్గిడి జయ తదితరులు పాల్గొన్నారు.