కృష్ణ కుమారి ఆశయాలను కొనసాగిస్తాం..

– పగిడేరులో జరిగిన సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి
– ప్రజాప్రతినిధిగా ప్రజల మనసులను గెలుచుకున్న కృష్ణకుమారి
– మాజీ ఎంపీ మిడియం బాబూరావు
– సమాజంలో శాశ్వతంగా నిలిచిపోయారు
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
దేశంలో తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిందని, దానిని ఓడించడమే కుంజ కుమారికి అర్పించే నిజమైన నివాళులని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సోమవారం పగిడేరులో మాజీ సర్పంచ్‌, ఎంపీటీసీ కామ్రేడ్‌ కృష్ణకుమారి సంస్మరణ సభ మండల కార్యదర్శి కోడిశాల రాములు అధ్యక్షతన జరిగింది. ముందుగా గ్రామంలో స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో ఆమె మాట్లాడుతూ.. కమ్యూనిజంపై అచంచలమైన విశ్వాసం మనోనిబ్బరం కలిగిన కృష్ణకుమారి ధన్యురాలని అన్నారు.
అనంతరం ఖమ్మం జిల్లా ఐద్వా కార్యదర్శి బుగ్గ వీటి సరళ మాట్లాడుతూ.. 2005లో 200 మందితో మహిళలకు రాజకీయ క్లాసులు నిర్వహించిన ఘనత కృష్ణకుమార్‌కి దక్కిందన్నారు. మహిళా సమస్యలకు రాజకీయల కారణమని ఆనాడే రాజకీయ క్లాసులు నిర్వహించిందన్నారు. పార్టీలో పదవులు అలంకరణ కాకుండా ప్రజల కోసం ఆయుధంగా ఉపయోగించిందన్నారు. ఆమె మహిళగా కాకుండా ఒక పురుష నాయకుడుగా పనిచేస్తుందన్నారు. పార్టీ ఇచ్చిన క్రమశిక్షణతో సమస్యలపై పోరాటం నిర్వహించిన వనిత అన్నారు. సహా ధర్మచారిగా కాకుండా మహిళలకు సమస్యలు పరిశీలించిందన్నారు. కుటుంబ సభ్యులు చనిపోతే ఏడవడమే కాకుండా ధైర్యంగా ఆమె ఆశయాలను పునుగుపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆశయాల కోసం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని ఆ పిలుపునిచ్చారు. అనంతరం మాజీ పార్లమెంట్‌ సభ్యులు రాష్ట్ర కమిటీ నాయకులు మీడియం బాబురావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పినపాక నియోజకవర్గంలో కమ్యూనిస్టు భావజాలం అధికంగా ఉన్న గ్రామం, ఉద్యమాలకు కూడా పేరుగాంచిన పగిడేరు అన్నారు. సీపీఐ(ఎం) తరఫున నిలబడి ఉద్యమాలు నిర్వహించి ప్రజాప్రతినిధిగా ప్రజల మనసులను గెలుచుకున్న వ్యక్తి కృష్ణకుమారి అని అన్నారు.
కష్ణకుమారి వీరత్వం కలిగిన మహిళ అన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. చావు పుట్టుకలు సహజమని అన్నారు. కొందరు కుటుంబం కోసం పాకులాడితే మరికొందరు సమాజంలో సమస్యలపై పోరాడుతారన్నారు. కుటుంబం కోసం పనిచేసే వ్యక్తులు కొంతకాలం మాత్రమే గుర్తింపు పోతారని చివరికి కుటుంబ సభ్యులు మర్చిపోతున్నారు. సమాజం కోసం పనిచేసే వారు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారని అన్నారు. పెద్ద డిగ్రీలు చదువుకోలేక పోయిన ప్రజల సమస్యలను అధ్యయనం చేసిందన్నారు ప్రజల కోసం పోరాటాలు చేసిందన్నారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఉద్యమాలు చేసింది అన్నారు. ఒకవైపు ఆరోగ్యంతో బాధపడుతూనే మంచానికే పరిమితమై చివరి వరకు పార్టీ కోసం పనిచేసిన వీర మహిళా అన్నారు. ఆమె ఆశయం కోసం ఈ ప్రాంత లో కమ్యూనిస్టు పార్టీకి ప్రత్యేకంగా సిపిఎం పార్టీకి తీవ్ర నష్టమని అన్నారు. ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మధు, ఐద్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి, సీనియర్‌ నాయకులు జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు గద్దల శ్రీనివాసరావు, మండల కార్యదర్శులు పినపాక నిమ్మల వెంకన్న, బూర్గంపాడు బత్తుల వెంకటేశ్వర్లు, కొమరం కాంతారావు, పాయం నరసింహారావు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల వెంకన్న, సత్రపల్లి సాంబశివరావు, ఉపతల నరసింహారావు, టీవీఎంవి ప్రసాద్‌, సర్గం బాల నరసయ్య, పగిడేరు శాఖ కార్యదర్శి పర్షిక పాపారావు, కృష్ణకుమారి భర్త కుంజ బాబురావు, కుమారుడు కుంజ రాజా, సంధ్యారాణి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు, కాంగ్రెస్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కాటుబోయిన, బీఆర్‌ఎస్‌ నాయకులు గువ్వా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణకుమారి స్థూపాన్ని ఆవిష్కరించిన మల్లు లక్ష్మి
మాజీ సర్పంచ్‌ రెండుసార్లు ఎంపీటీసీగా గెలుపొందిన కుంజ కృష్ణకుమారి స్తూపం ఆవిష్కరాన్ని సోమవారం మల్లు లక్ష్మి ఆవిష్కరించారు. వీరతెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కోడలు మల్లు లక్ష్మి పగిడేరు వస్తుందని వార్త తెలుసుకొని మహిళలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గుడిసెలకుంట, శాంతినగర్‌, గొల్ల కొత్తూరు గ్రామాల ప్రజలు నల్గొండ, వరంగల్‌ ప్రాంతాల నుండి వలస వచ్చిన వారే అధికంగా ఉంటారు. ఎర్రజెండాలతో నృత్యాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య జండా ఆవిష్కరించారు. మల్లు లక్ష్మి స్థూపాన్ని ఆవిష్కరించారు. జోహార్లు కుంజ కృష్ణకుమారి, సాధిస్తాం మీ ఆశయాలను నినాదాలతో ప్రాంతమంతా మారు మోగిపోయింది. అనంతరం కుంజ కృష్ణకుమారి ఇంటి వద్ద ఏర్పాటుచేసిన సంతాప సభలో ప్రజలు సభ ముగిసేంతవరకు ఆసక్తిగా సంస్మరణ సభలో ప్రజలు పాల్గొనడం విశేషం. చారిత్రాత్మక గ్రామమైన పగిడేరు లో ఇంత భారీగా ప్రజలు రావడం ఇదే మొదటిసారి అని సీనియర్‌ నాయకులు గ్రామ పెద్దలు చర్చించుకున్నారు.