
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ మండల కమిటీ సభ్యులు కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి (ధర్మ భిక్షం) ఆశయ సాధనకై కూలీ, భూమి పోరాటాలను ఉదృతంగా కొనసాగిద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. భువనగిరి మండలం చీమలకొండూరు గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన కామ్రేడ్ పల్లెర్ల బిక్షపతి సంతాప సభకు హాజరై, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య, కొండ అశోకు, మండల కమిటీ సభ్యులు సిల్వేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, మాజీ మండల కమిటీ సభ్యులు వడ్డెబోయిన వెంకటేష్, సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి బోడ ఆంజనేయులు, ముత్తిరెడ్డిగూడెం శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ, ముస్త్యలపల్లి శాఖ కార్యదర్శి కళ్లెం లక్ష్మి నరసయ్య , శాఖ సభ్యులు రావుల పోషాలు, రావుల కిష్టయ్య , పల్లెర్ల వినోదు , గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.