ప్రగతిని కొనసాగిద్దాం బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టుదాం

– బీఆర్‌ఎస్‌ చెవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య
ఘన స్వాగతం పలికిన మహిళలు
నవతెలంగాణ-చేవెళ్ల
ప్రగతిని కొనసాగిద్దాం, బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కడుదామని బీఆర్‌ఎస్‌ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల మండల పరిధిలోని మల్లారెడ్డిగూడ, కొటాల, కందవాడ, నారాయణ్‌ దాస్‌ గూడ గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాయ మాటలు చెబుతున్న వారిని నమ్మొద్దన్నారు. ఇంత కాలం అధికారంలో ఉన్న పార్టీలు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా ఎన్నికలు రాగానే మళ్లీ ‘మాకు ఒక అవకాశం ఇవ్వాలనీ’ తిరుగుతున్న వారిని ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి, అధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ మల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు మాలతి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బక్కరెడ్డి రవీందర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటి చైర్మన్‌ మిట్ట రంగారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మెన్‌ బ్యాగరి నర్సింలు, ఆయా గ్రామాల సర్పంచులు భీమయ్య, మల్లారెడ్డి, ఎంపీటీసీలు రవీందర్‌, సత్యనారాయణ చారి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్‌, మాజీ ఎంపీపీ బాల్‌ రాజ్‌, రామన్న గూడ గ్రామ సర్పంచ్‌ నడిమొళ్ల లావణ్యశంకర్‌, మల్లారెడ్డి గూడ గ్రామ సర్పంచ్‌ మోహన్‌ రెడ్డి, దామరిగిద్ద గ్రామ సర్పంచ్‌ వెంకటేశం గుప్తా, మైనార్టీ జిల్లా నాయకులు అలీ, పట్టణ అధ్యక్షుడు జైపాల్‌ రెడ్డి, డైరెక్టర్లు కృష్ణ, మాజీ డైరక్టర్‌ ఘనీ, సీనియర్‌ నాయకులు కృష్ణారెడ్డి, నాగార్జునరెడ్డి, మాణిక్య రెడ్డి పాల్గొన్నారు.